Tag Archives: Jayasudha

సావిత్రి గురించి మాత్రమే కాకుండా ఇతర తారల గురించి ఇండస్ట్రీ ఎందుకు గొప్పగా చెప్పరు..!

సినీనటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ ఒకప్పడు హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు.అప్పట్లో జయప్రద శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ధీటుగా నిలిచారు. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా ఆ ఇద్దరు హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గకుండా అదే రీతిలో సినిమాలు కొనసాగించేవారు. అంతేకాకుండా లెజెండరీ డైరెక్టర్ సత్యజిత్ రే లాంటి వారు ఇవాళ దేశం మొత్తం మీద జయప్రద లాంటి అందమైన తార ఇంకొకరు లేరు అనేశారు.

కానీ శ్రీదేవి మాత్రం కోట్లాది మంది ప్రేక్షకులకు కలలరాణి గా పేరు తెచ్చుకుంది. అలాంటి టాప్ టాప్ హీరోయిన్ లతో పాటుగా నటించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో మహానటి అనే గొప్ప మాటకు సావిత్రి అన్న పేరు మాత్రమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ సావిత్రి తర్వాత ఎంతోమంది నటీమణులు గొప్ప గొప్ప సినిమాలు పాత్రలు చేశారని కానీ వారికి అలాంటి గుర్తింపు రాలేదని బాధపడతారు.

ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గారి తర్వాత అంత గొప్ప సినిమాలు వాణిశ్రీ చేశారు. కానీ ఎంతమంది వాణిశ్రీ గురించి చెబుతారు. అలాగే శారద గారు సెకండ్ ఇన్నింగ్స్ హీరోయిన్ గానే కాకుండా మదర్, పోలీస్ ఆఫీసర్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో కూడా నటించారు. పరుచూరిబ్రదర్స్ ఆమెకు అలాంటి పాత్రను సృష్టించారు.

ఉమెన్ ఇన్ తెలుగు అన్ని సినిమా తీసుకుంటే సావిత్రి తర్వాత ఇంకా ఎవరి గురించి మాట్లాడటం లేదు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అదేవిధంగా సావిత్రి తర్వాత అంతకంటే మంచి సినిమాల్లో నటించిన వారికి కూడా గౌరవం దక్కాలి కదా! వాణిశ్రీ శారద తర్వాత సీరియస్ రోల్స్ చేయడానికి నేను వచ్చాను పెద్ద హీరోలతో చేసే చిన్న చిన్న హీరోలతో ఎందుకు చేస్తావ్ అని నన్ను అన్న వారు కూడా ఉన్నారు. కానీ కేవలం పాత్రలు నచ్చినవి మాత్రమే నేను చేస్తాను అని ఆమె చెప్పుకొచ్చారు.

జయసుధకు ఏమైంది.. ఇలా ఎందుకు మారింది.. ఫోటో వైరల్..

సినీ పరిశ్రమలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె అసలు పేరు సుజాత. ఆమె మద్రాసులో జన్మించినా.. ఆమె మాతృభాష తెలుగే అని చెప్పుకుట్టుంది. పండంటి కాపురం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ నటి.. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించారు.

1985లో ఆమె నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు నిహార్, రెండో కుమారుడు పేరు శ్రేయంత్ ఉన్నారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె ఫొటో ఒకటి వైరల్ గా మారింది.

దానిని చూసిన ప్రతీ ఒక్కరూ జయసుధ ఎంటి ఇలా మారారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నారు. అక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నారు. ఒకప్పుడు వరస సినిమాలో బిజీగా ఉండే ఈమె.. కొన్ని నెలలుగా ఎందుకో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

అయితే ఇటీవల ఆమె కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిహార్ కపూర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో గ్లామరస్ గా కనిపించిన ఆమె ప్రస్తుతం ఇలా మారడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

సహజ నటిగా పేరు సంపాదించుకున్న జయసుధ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాలలో సహజసిద్ధంగా ఎంతో అద్భుతంగా నటించడం వల్ల జయసుధ సహజనటిగా పేరు సంపాదించుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు సరసన నటించిన ఈమె ఆ తర్వాత తరం హీరోల సరసన కూడా నటించి మెప్పించారు.

ఒకప్పుడు ఎంతో అందంగా తన అభినయంతో ఎంతోమందిని ఆకట్టుకున్న జయసుధ వయసు పైబడే కొద్ది సినిమాలలో పలు తల్లి పాత్రలు, నాన్నమ్మ, అమ్మమ్మ పాత్రలలో నటించారు. తల్లిగా కొత్త బంగారు లోకం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, బొమ్మరిల్లు వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈ హీరోయిన్ ఆతర్వాత శతమానం భవతి, గోవిందుడు అందరివాడే వంటి సినిమాలలో అమ్మమ్మ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఇలాంటి పాత్రలకు పరిమితమైన నటి జయసుధ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు.ఒకప్పుడు తన అందంతోనే ఆకట్టుకున్న జయసుధ వయసు పైబడే కొద్ది జుట్టు, మొహం పై ముడతలు ఉండటం చూసిన అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఒకప్పుడు సహజనటి ఇలా మారిపోయారు ఏంటని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజ నటిగా పేరు సంపాదించుకున్న ఈమెను ఇలా చూసిన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.