Tag Archives: kantarao

Hero Kathi Kantharao Sons : 400 సినిమాలలో నటించిన ఒకప్పటి స్టార్ హీరో పిల్లలు.. దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు !

Hero Kathi Kantharao Sons : సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోలుగా ఓ వెలుగు వెలిగి చివరికి దీన పరిస్థితిలో మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు వారి చివరి రోజులలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న వారు ఉన్నారు.ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో నటుడు కాంతారావు ఒకరు.

ఈ విధంగా నాలుగు వందల సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఈయన పిల్లలు ప్రస్తుతం సాయం చేయాలని కోరుతున్నారు.తన తండ్రి సినిమాలలో నటిస్తూ సినిమాలపై మక్కువతో తన ఆస్తులు అన్ని అమ్మి సినిమాలు చేశారని ఇలా సినిమాలలో నష్టపోవడం వల్ల ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ఒకప్పుడు తమకు మద్రాసులో పెద్ద బంగ్లాలు కూడా ఉండేవి అయితే ప్రస్తుతం తల దాచుకోవడానికి నిలువ నీడ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాము అదే ఇంట్లో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తమపట్ల చొరవ చూపి ఇల్లు కేటాయించాలనీ వేడుకున్నారు.

Star Hero: ఎన్టీఆర్ ఏఎన్నార్లకు పోటీగా నటించిన కాంతారావు…

సూర్యాపేట జిల్లా గుడిబండ గ్రామంలో జన్మించిన కాంతారావు సినిమాలపై మక్కువతో నాటకాలు వేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ వంటి వారికి ఏమాత్రం తీసిపోకుండా సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కాంతారావు పిల్లలు ప్రస్తుతం దీన పరిస్థితిలో ఉండి ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

సినిమాలో వేషం కోసం ఎన్టీఆర్‌ను కలిసిన శోభ‌న్‌బాబు.. ఏ సినిమా కోసమో తెలుసా..?

నందమూరి తారక రామారావు భూకైలాస్ సినిమా తర్వాత రావణుడి పాత్రలో 1961 సంవత్సరంలో ‘సీతారామ కళ్యాణం’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. రావణుడి పాత్ర అనేది నాకు ఫేవరేట్ అంటూ అతడు అప్పట్లో చెప్పుకొనే వారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.

ఇందులో శ్రీరామునిగా హరనాథ్ ను ఎంపిక చేయగా.. సీతగా గీతాంజలిని ఎంపిక చేశారు. ఆ విషయం తెలుసుకున్న శోభన్ బాబు.. ఓ రోజు ‘దైవబలం’ సెట్ లో ఉన్న ఎన్టీఆర్ ను కలిసేందుకు వెళ్లారట. అక్కడ ఎన్టీఆర్ అతడిని ‘రండి బ్రదర్..’ అంటూ ఆప్యాయంగా పలకరించి.. ఏ వేషం వేస్తావని అడగడంతో.. కంగారులో లక్ష్మ‌ణుడి పాత్ర వేస్తానని చెప్పారట శోభన్ బాబు.

దీంతో ‘సీతారామ కళ్యాణం’ సినిమాలో శోభన్ బాబుకు లక్ష్మ‌ణుడి పాత్రలో చేసేందుకు అవకాశం వచ్చిందట. అస్సలు ఆ సినిమాలో లక్ష్మ‌ణుడి పాత్ర చాలా చిన్నది. అయినా శోభన్ బాబు అందులో నటించారు. ఆ సినిమా చేసిన వెంట‌నే శోభన్ బాబుకి ‘భీష్మ’ సినిమాలో పనిచేసే అవ‌కాశం కల్పించారు ఎన్టీఆర్. అందులో అర్జునుని వేషం వేశారు శోభ‌న్‌ బాబు. అలా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో శోభన్ బాబును నంద‌మూరి తార‌క‌రామారావు ప్రోత్సహించడంతో తన కెరీర్ ను ముందుకు సాగించారు.

ఈ సినిమాలో నారద పాత్ర కాంతారావు ధరించారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట ‘కానరార కైలాస నివాస’, ‘జటాకటాహ’ మొదలైనవి రాజేశ్వరరావు స్వరపరచారు. తెలుగు చిత్రగీతాల్లో ‘ఆల్ టైమ్ సూపర్ హిట్’ గా చెప్పదగిన ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట ఇందులోనిదే.