Tag Archives: krishna jayaprada combination

Krishna – Jayaprada: సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషన్ రికార్డును ఎవరైనా దాటగలరా.!!

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన కథానాయకుడు. 1964 కంటే ముందు కృష్ణ కొన్ని చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పటికీ ఆ తర్వాత హీరోగా నటించడం మొదలుపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగిన అతని సినీ జైత్రయాత్ర లో…ఆయనా ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ.. యువ హీరోలకు సైతం పోటీనిచ్చిన హీరోగా చెప్పుకోవచ్చు. దాదాపు 350 పైచిలుకు చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ అనిపించుకున్నారు .హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా అనేక చిత్రాల్లో నటిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగడించారు.

1964 దర్శకుడు ఆదుర్తిసుబ్బారావు తను తీస్తున్న సినిమాకి నూతన నటీనటులు కావాలని పేపర్ యాడ్ ఇచ్చారు. అది చదివిన హీరో కృష్ణ తన ఫోటోలను మద్రాస్ పంపించారు. అనేక వడపోతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కృష్ణని ఈ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపికచేయడం జరిగింది. అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ సినీ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశమే హద్దుగా అనేక చిత్రాల్లో నటించారు. అయితే కృష్ణ, జయప్రద ఇద్దరిదీ హిట్ కాంబినేషన్. వీరిద్దరు 43 చిత్రాల్లో కలిసి నటించారు. విజయా సంస్థ, బాపు దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో కృష్ణ, జయప్రదల కాంబినేషన్ మొదలయింది.

రాజ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976). మన ఊరి కథ(1976), ఈనాటి బంధం ఏనాటిదో (1977), దొంగలకు దొంగ (1977), అల్లరి బుల్లోడు(1978), ఏజెంట్ గోపి (1978), దొంగల వేట (1978), కుమార్ రాజా (1978), అతనికంటే ఘనుడు (1978), వియ్యాలవారి కయ్యాలు (1979), దొంగలకు సవాల్ (1979), కొత్త అల్లుడు(1979), మండే గుండెలు (1979), శంఖుతీర్థం (1979), భలే కృష్ణుడు (1980), కొత్తపేటరౌడీ (1980), రగిలే హృదయాలు (1980), బండోడు గుండమ్మ(1980), అల్లరి బావ(1980), ఊరికి మొనగాడు (1981), రహస్య గూడచారి(1981), జతగాడు(1981), మాయదారి అల్లుడు(1981), నివురుగప్పిన నిప్పు(1982), జగన్నాధ రథచక్రాలు (1982), పగబట్టిన సింహం(1982), ఏకలవ్య(1982), ముందడుగు(1983), సిరిపురం మొనగాడు (1983), ప్రజారాజ్యం(1983), యుద్ధము(1984), నాయకులకు సవాల్ (1984), బంగారు కాపురం(1984), మహాసంగ్రామం(1985), సూర్య చంద్ర (1985), మహామనిషి(1985), కృష్ణ గారడి(1985), సింహాసనం (1986), తేనె మనసులు (1987), విశ్వనాథనాయకుడు (1987), కలియుగ కర్ణుడు(1988), అత్త మెచ్చిన అల్లుడు(1989)…

ఓ దశాబ్దం పాటు వీరి కలయికలో తిరిగి ఏ సినిమా రాలేదు. అలా చివరగా ఉమాకాంత్ దర్శకత్వంలో “చంద్రవంశం” (2002) చిత్రంలో వీరిద్దరూ నటించి నలభై మూడు చిత్రాలను నిర్విరామంగా పూర్తిచేశారు. ఈ సినిమాలలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “ఊరికి మొనగాడు” చిత్రం, బాపయ్య దర్శకత్వంలో వచ్చిన “ముందడుగు” చిత్రం అదేవిధంగా కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన “సింహాసనం” సినిమా బాక్సాఫీసు వద్ద విజయ దుందుభి మోగించాయి. ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏ హీరో,హీరోయిన్ కూడా కృష్ణ జయప్రద కాంబినేషన్ రికార్డును అధిగమించడం సందేహమే.