Tag Archives: Kurchi Thatha

Kurchi Thatha: నాగార్జున నువ్వేమైనా పేదోడివా.. కోట్లు సంపాదిస్తున్నావుగా.. ఫైర్ అయిన కుర్చీ తాత?

Kurchi Thatha: కుర్చీ తాత ఇటీవల భారీ స్థాయిలో ఫేమస్ అయ్యారు ఈయన ఆ కుర్చీ మడత పెట్టు అనే డైలాగుతో ఒకసారిగా వార్తలలో నిలిచారు ఇకపోతే ఈ డైలాగుతో ఏకంగా గుంటూరు కారం సినిమాలో పాట కూడా పెట్టడంతో కుర్చీ తాత రెండు తెలుగు రాష్ట్రాలలో సెన్సేషనల్ గా మారిపోయారు. ఇక ఈయన ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈయన కుర్చీ మడత పెట్టు అంటూ చెప్పినటువంటి డైలాగ్ ఫేమస్ అవడంతో మీడియా వాళ్ళు కూడా ఈయనతో భారీ స్థాయిలో ఇంటర్వ్యూలు తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతంలో ఈయన కేటీఆర్ కెసిఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి గతంలో ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ కార్యక్రమం అంటే చాలామందిలో పూర్తిస్థాయి వ్యతిరేకత ఉంది అనే సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం పట్ల చాలామంది వ్యతిరేకత చూపించడమే కాకుండా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి అంటూ కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కుర్చీ తాత సైతం బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున పై మండిపడ్డారు.

అన్ని కోట్లు ఏం చేస్తావ్…

నాగార్జునకు వేలకోట్ల ఆస్తి ఉంది అయినప్పటికీ డబ్బు కోసం కకృతి పడుతూ ఇలాంటి కార్యక్రమానికి పనిచేయడం దేనికి నీకేమైనా డబ్బు లేదా నువ్వేమైనా పేదోడివా అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మీ ఇద్దరి కొడుకులు అలాగే నీ భార్య కూడా భారీగా సంపాదిస్తుంది కదా అన్ని కోట్లు ఏం చేసుకుంటావు అంటూ నాగార్జున పట్ల గతంలో కుర్చీ తాత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.