Tag Archives: Lack of financial independence

Ramgopal Varma: ఆ రెండు కారణాల వల్ల విడాకుల సంఖ్య పెరిగిపోతుంది…. వర్మ షాకింగ్ కామెంట్స్!

Ramgopal Varma: ప్రస్తుత కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నటు వంటి ఈ వ్యవహారం ప్రస్తుతం సాధారణ ప్రజలలోకి కూడా వెళ్ళింది.చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ తమకు విడాకులు కావాలి అంటూ వయసు పైబడిన వారు కూడా విడాకులు తీసుకుని విడిపోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ విధంగా చాలామంది ఏదో ఒక కారణాలు చూపిస్తూ విడాకులు తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజాగా ఈ విడాకుల గురించి సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. ముఖ్యంగా విడాకులు తీసుకోవడానికి గల కారణాలను ఈయన తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాంగోపాల్ వర్మ విడాకుల గురించి మాట్లాడుతూ కేవలం రెండు కారణాల వల్ల మాత్రమే విడాకులు తీసుకుని విడిపోయే వారి సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. మనదేశంలో 100% విడాకులు తీసుకోవడానికి గల కారణం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్ లేకపోవడమే కారణమని ఈయన తెలిపారు.

Ramgopal Varma: మనిషి చేస్తున్న తప్పు అదే…

ఈ రెండు కారణాల వల్ల విడాకులు సంఖ్య పెరిగిపోతోందని ఒక మనిషి తన జీవితంలో చేసే తప్పు ఏంటంటే తనకోసం కాకుండా ఇతర వ్యక్తుల కోసం బ్రతకడమేనని ఈయన తెలిపారు.ఇక ఈ ఇంటర్వ్యూలో తన గురించి కూడా మాట్లాడుతూ తాను కూడా ఈ విడాకుల బంధం నుంచి బయటపడ్డాను కనుక తన జీవితంలో చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఈయన తన గురించి కూడా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే వర్మ వ్యాఖ్యలపై కొందరు ఆయనకు మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం అతని వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.