Tag Archives: lawer

సీఎం జగన్ కు షాకిచ్చిన సుప్రీంకోర్టు లాయర్… ఏం జరిగిందంటే..?

సుప్రీంకోర్టు లాయర్ అశ్వినికుమార్ ఉపాధ్యాయ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కార పిటిషన్ ను దాఖలు చేయడానికి అనుమతి ఇవ్వాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో అశ్వినికుమార్ జగన్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ 31 కేసులలో నిందితునిగా ఉన్నారని.. జగన్ కోర్టులు, న్యాయమూర్తులను బెదిరించే విధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.

చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిరంగ లేఖను బహిరంగపరచడం కోర్టు ధిక్కార చర్యగా పేర్కొన్నారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అశ్వినీ కుమార్ చీఫ్ జస్టిస్ ను కోరారు. ప్రస్తుతం అశ్వినికుమార్ రాసిన లేఖ గురించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం అశ్వినీకుమార్ ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను వేగంగా పరిష్కరించాలని కోరుతూ ఒక పిల్ ను దాఖలు చేశారు.

జస్టిస్ ఎన్వీ రమణ ఎవరైతే రాజకీయ నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని.. సీఎం జగన్ ప్రజా ప్రతినిధులపై కేసులపై కేసులను వేగంగా పరిష్కరించాలన్న తీర్పు వల్ల ఆగ్రహం ఉండవచ్చని తెలిపారు. జగన్, ఆయన సహచరులు తీవ్ర నేరారోపాలను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. ఏడీఆర్ నివేదిక ద్వారా ఈ విషయాలు తెలిశాయని పేర్కొన్నారు.

జగన్ పై నమోదైన కేసులు ప్రూవ్ అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుందని.. ప్రస్తుత లేఖ ప్రభావం జగన్ పై దాఖలైన కేసుల్లో తీర్పు చెప్పే న్యాయమూర్తులపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సీఎం జగన్ న్యాయవ్యవస్థకు బెదిరింపులకు పాల్పడినప్పట్టుగానే జరిగిన ఘటనలను పరిగణించాలని తెలిపారు. అయితే అటార్నీ జనరల్ ఈ లేఖపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.