Tag Archives: lb stadium

కేసీఆర్ సంచలన నిర్ణయం.. అపార్ట్‌మెంట్ వాసులకు శుభవార్త..?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు పనితీరును బేరీజు వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచనలు చేశారు. ప్రభుత్వం, నేతలు అభివృద్ధి చేస్తున్న తీరును బట్టి నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. చాలా చైతన్యం, చరిత్ర ఉన్న నగరం హైదరాబాద్ అని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఓటు వేస్తే సేవ చేసే మంచి నాయకులు పుట్టుకొస్తారని.. 2001 సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం మొదలుపెట్టిన సమయంలో ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారని పేర్కొన్నారు. తాను రాష్ట్రాన్ని నడపలేనని ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరు వెంకటేశ్వరరావు అన్నారని కానీ ఆరు సంవత్సరాలలో వారి అంచనాలు తలక్రిందులు అయ్యేలా పాలన సాగించానని కేసీఆర్ తెలిపారు.

గతంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవని ప్రజలు ఇన్వర్టర్లు, జనరేటర్లపై ప్రజలు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేదని.. తెలంగాణ వచ్చిన తరువాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఎన్నో అనుమానాలు, అపోహల మధ్య టీఆర్ ఎస్ పార్టీని ప్రజలు నమ్మి దీవించారని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణకే తలసరి విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని తెలిపారు.

నగరంలో 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీరు ఇచ్చామని.. అపార్టుమెంట్ల విషయంలో కూడా 20 వేల లీటర్ల పథకం వర్తిస్తుందని అపార్టుమెంట్ వాసులకు మంచి శుభవార్త చెప్పారు. ఈ నిర్ణయం శాశ్వతంగా అమలులో ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.