Tag Archives: license

మద్యం తాగేవారికి షాక్.. ఇంట్లో ఎక్కువ మద్యం ఉంటే లైసెన్స్ ఉండాల్సిందే..?

దేశంలో మద్యం ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ ఉంచుకున్నా ఇబ్బందులు పడక తప్పదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం కొనుగోలు చేసి ఇంట్లో దాచుకునే వారికి భారీ షాక్ ఇచ్చింది.

ఎక్సైజ్ శాఖ నిబంధనలలో కీలక సవరణలు చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం రవాణా చేయడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదు. నూతన మార్గదర్శకాల ప్రకారం కేవలం ఆరు లీటర్ల మద్యానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆరు లీటర్ల కంటే ఎక్కువ మొత్తం మద్యం నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం లైసెన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఎవరైనా ప్రభుత్వ లైసెన్స్ ను పొందాలని భావిస్తే వారు 51 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడంతో పాటు 12 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంతో పోలిస్తే రిటైలర్స్ కు కూడా 7.5 శాతం లైసెన్స్ ఫీజును పెంచింది. అదే సమయంలో బీరుపై గతంతో ఉన్న సుకంతో పోలిస్తే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. తక్కువ ఆల్కహాల్ పానీయాలను ప్రోత్సహించే దిశగా యూపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

గతేడాది లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల ఆదాయం తగ్గిన నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్త్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లతో వైన్ తయారు చేసేవారికి ఐదు సంవత్సరాల పాటు ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.