Tag Archives: loan

మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అలా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం స్వనిధి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవారు కేంద్రం నుంచి 10,000 రూపాయల రుణం పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా అర్హత ఉన్న వీధి వ్యాపారులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉంటే కేంద్రం ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ప్రధాన్ మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పేరుతో అమలవుతున్న ఈ స్కీమ్ కోసం అర్హత పొందాలంటే ఇంటి నుంచే సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్ సైట్ ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ తీసుకున్న వీధి వ్యాపారులు క్రమం తప్పకుండా లోన్ ను చెల్లించడంతో పాటు ఈ.ఎం.ఐ కట్టడం ద్వారా వడ్డీరేటులో సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థలు ఇచ్చే ఐడెంటిటీ కార్డ్ ఉన్నవాళ్లే ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 12 ఈఎంఐల రూపంలో 9 శాతం వడ్డీతో ఈ రుణాలను తిరిగి చెల్లించాలి.

పీఎం స్వనిధి వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. లోన్ సక్రమంగా చెల్లించిన వీధి వ్యాపారులు 1200 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. సక్రమంగా చెల్లించిన వారు మళ్లీ ఈ స్కీమ్ ద్వారా రుణం తీసుకునే అర్హత పొందుతారు.