Tag Archives: Love effect

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

Love Effect: ప్రేమ వ్యవహారం ఓ యువతి మరణానికి కారణమైందా…? అయితే ప్రియుడే హత్య చేశాడా లేకపోతే..? అమ్మాయే ఆత్మహత్యకు పాల్పడిందా.. ? ఇలా ఓ యువతి మరణం పలు ప్రశ్నలకు తావిస్తోంది. శ్రీకాకుళం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సంధిగూడ గ్రామంలోని మండంగి సంధ్య( 25) అనుమానాస్పదంగా మృతిచెందింది.

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

అసలు ఏం జరిగిందో తెలియదు కానీ.. మంగళవారం రాత్రి సంధిగూడ గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న చింతచెట్టుకు ఆమె వేలాడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెది హత్యా..? ఆత్మహత్యా..? అని తేల్చేపనిలో ఉన్నారు.

Love Effect: ప్రేమ వ్యవహారం.. ? చింత చెట్టుకు వేలాడుతూ యువతి..?

ఈ సంఘటనపై ఎల్విన్ పేట సీఐ టీవీ తిరుపతి రావు, ఎస్సై షన్ముఖ రావు బుధవారం విలేఖరులకు సంధ్య మృతిపై వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలంల గోహిది గ్రామానికి చెందిన సంధ్యకు గుమ్మలక్ష్మీపురం మండలం వంగర పంచాయతీ సంధిగూడకు చెందిన ఆరిక లక్ష్మణ్ తో పరిచయం ఏర్పడింది. 


పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో ..

ఈపరిచయం ప్రేమగా మారింది.  ఈ క్రమంలోనే సంధ్య నాలుగు సార్లు లక్ష్మణ్  ఇంటికి వచ్చి వెళ్లింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఓసారి సంధ్య లక్ష్మణ్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. సంధ్య, లక్ష్మణ్ కు చెందిన స్టడీ సర్టిఫికేట్లు తీసుకెళ్లింది. అయితే ఇటీవల పలు పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో లక్ష్మణ్ తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. అయితే సంధ్య లక్ష్మణ్ కోరికను నిరాకరించింది. ఈ నేపథ్యంలో గోహిది సర్పంచ్ కి లక్ష్మణ్ ఫోన్ చేసి తన సర్టిఫికేట్లు ఇవ్వాలని కోరాడు. ఈ మేరకు సర్పంచ్.. సంధ్యతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించాడు.  ఇదిలా ఉండగా లక్ష్మణ్ జనవరి 28న పనిమీద విశాఖ జిల్లా పెందుర్తి వెళ్లిన సమయంలో సంధ్య మళ్లీ సంధిగూడకు వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సంధిగూడకు 400 మీటర్ల దూరంలోని చింతచెట్టుకు మృతిచెంది వేలాడుతూ కనిపించింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. అనంతరం పార్వతీపురం ఏరియాసుపత్రికి తరలించి మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మరణానికి సంబంధించిన కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.