Tag Archives: Lungs are damaged

Dharmavarapu Subramanyam: బ్రహ్మానందం గారు ఇంటికి రావడానికి నాన్న ఒప్పుకునే వారు కాదు: ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు

Dharmavarapu Subramanyam: సీనియర్ నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, కామెడియన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా కూడా సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్య ఉన్నాడు. యజ్ఞం, ఆలస్యం అమృతం వంటి సినిమాలకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాల వల్ల 2013 శ్వాస విడిచాడు.

ఇదిలా ఉండగా ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ..” ఈరోజు మేము ఇంత ఆనందంగా జీవిస్తున్నామంటే అందుకు కారణం మా నాన్న. కొన్ని వందల సినిమాలలో నటించి ఆయన సంపాదించిన ఆస్తి వల్లే మేము ఈరోజు ఏ కష్టం లేకుండా ఆనందంగా బ్రతుకుతున్నాము.

2001 లో ‘నువ్వు నేనూ ‘ సినిమా సక్సెస్ పార్టీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో తలమీద 21 కుట్లు పడ్డాయి. అలా 2001లో ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత నాన్నకి ఉన్న సిగరెట్ అలవాటు వల్ల 2005లో లంగ్స్ పాడయ్యి తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ సమయంలో పది రోజులపాటు ఆయన కోమాలో ఉన్నారు. ఆ తర్వాత డాక్టర్లు మెరుగైన చికిత్స అందించడంతో కోమా నుండి బయటపడి ఆరోగ్యంగా కోలుకున్నాడు. ఇలా రెండుసార్లు మృత్యులతో పోరాడి గెలిచిన ఆయన మూడవసారి ప్రాణాలు కోల్పోయాడు.

Dharmavarapu Subramanyam:

2012లో దీపావళి తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. నాన్నను పరిశీలించిన డాక్టర్లు ఆయన 11 నెలల కంటే ఎక్కువ బ్రతకరని తెలిపారు. తాను ఎక్కువకాలం బ్రతకనని నాన్నకి కూడా తెలుసు. ఊపిరితిత్తుల క్యాన్సర్ చివరి దశకు చేరుకోవటంతో 2013 డిసెంబర్ 7వ తేదీన నాన్న మరణించారు” అంటూ ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొడుకు వెల్లడించాడు.ఆ సమయంలో బ్రహ్మానందం గారు నాన్నని చూడటానికి వస్తానని ఎన్నిసార్లు అడిగినా నాన్న నువ్వు నన్ను చూస్తే తట్టుకోలేవు వద్దు తనని రాణించేవారు కాదని ఈ సందర్భంగా రవి బ్రహ్మ తేజ తెలిపారు.