Tag Archives: madhya pradesh

విద్యార్థులకు అలర్ట్.. మార్చి 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్..?

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. అయితే పాఠశాలలు తెరిచే విషయంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మార్చి నెల 31వ తేదీ వరకు స్కూల్స్ బంద్ చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్ అధికారులతో చర్చించి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రంలో స్కూల్స్ బంద్ కొనసాగినా 10, 12 తరగతుల విద్యార్థులకు మాత్రం యథాతథంగా క్లాసులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఐదు, ఎనిమిది తరగతుల బోర్డు పరీక్షలు జరిగేవి.

అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం ఆ పరీక్షలను కూడా రద్దు చేయడం గమనార్హం. అయితే తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులకు రెండు రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగా మార్కులు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 2021 ఏప్రిల్‌ నెలలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని సమాచారం.

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని మధ్యప్రదేశ్ సర్కార్ వెల్లడించింది. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.