Tag Archives: magnesium

జలుబు, దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారా.. సోంపుతో ఇలా చెయ్యండి..?

సోంపు అంటే మన భాషలో చాలామంది ఒక్కపొడి అని కూడా అంటారు. ఇవి చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఈ చిన్న ధాన్యాలలోనే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి. అయితే వీటి ద్వారా ముఖ్యంగా బరువు తగ్గలేని వారికి సోంపు ఒక వరం లాంటిది. దానిని తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. కేలరీలు వేగంగా కరుగుతాయి.

బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. తిన్న ఆహారం వెంటనే జీర్ణం కావడానికి మరియు నోటిలో ఏమైనా వాసన లాంటివి వస్తే వాటి నుంచి బయటపడటానికి కూడా ఈ సోంపు గింజలను ఉపయోగిస్తారు. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడంలో సోంపు ప్రభావవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, పైల్స్, ఆమ్లత్వం, వాయువు వంటి సమస్యలను అధిగమిస్తారు. నిద్రసరిగ్గా పట్టని వాళ్లు ఈ సోంపు తినడం ద్వారా వెంటనే నిద్ర పడుతుంది.

నిద్రకు ఎక్కువగా ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్. దీనిని తినడం ద్వారా మెలటోనిన్ స్రవించడానికి పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దగ్గు, ఆయాసం మరియు జలుబు తగ్గడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. 10 గ్రాముల సోంపు గింజలను 250 మిల్లి లీటర్ల నీటిలో కలిసి గోరువెచ్చగా వేడి చేయాలి. తర్వాత వడబోసి 100 మి. లీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించాలి.

ఇలా చేయటం వల్ల జలుబు, దగ్గు, ఆయాసం అనేవి మాయం అయిపోతాయి. అలా కాకుంటే.. సోంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి ఉంచి రోజుకి రెండుపూటల పూటకు అర టీ స్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి. ఇలా చేస్తే జలుబు, దగ్గు, ఆయాసం మన దరి చేరవు.