Tag Archives: mango cost 1000

వామ్మో.. ఒక్క మామిడి పండు ఖరీదు రూ.వెయ్యి?

వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రాలలో దొరికే బంగినపల్లి, రసాలు, నీలం వంటి రకాలకు చెందిన మామిడిపండ్లు ఎక్కువగా పండిస్తారు. వీటి ధర కూడా మనకు ఎంతో అందుబాటులోనే ఉంటుంది.కానీ మధ్యప్రదేశ్ కి చెందిన ఓ మామిడి పండు రకము మాత్రం కిలో రూ 1000 పలుకుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మామిడి పండ్లు ఒక్కొక్కటి సుమారు కిలోల బరువును కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ పండు ధర ఏకంగా వెయ్యి రూపాయలు పలుకుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పండు సైజు పెద్దగా ఉండటంతో అత్యధిక ధర పలుకుతోందని రైతులు తెలియజేస్తున్నారు.

ఎంతో రుచికరమైన ఎన్నో పోషకాలు కలిగిన ‘నూర్జహాన్’ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్ చేసుకుంటారని, ఒక్కో పండు సుమారు 2 కిలోల నుంచి
3.5 కిలోల బరువు ఉంటుంది. 2019 వ సంవత్సరంలో ఒక్కో మామిడిపండు బరువు 2.75 కేజీలతో పండింది. ఆ సంవత్సరంలో అత్యధికంగా ఒక్కో పండు ధర సుమారుగా రూ.1200 ధర పలికిందని రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు.