Tag Archives: .Mega mass war

Chiranjeevi -Raviteja: రవితేజ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన చిరు…మొదలైన మెగా మాస్ వార్..?

Chiranjeevi -Raviteja: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని కోట్లు కొల్లగొడుతుంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఇంత మంచి హిట్ అవటానికి రవితేజ నటించిన పాత్ర కూడా ఒక కారణం అని చెప్పవచ్చు.

ఇలా సినిమా విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి ఇటీవల చిరంజీవి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మాస్ మహారాజా అభిమానులు చిరంజీవిపై గుర్రుగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే… వాల్తేరు వీరయ్య సినిమా మంచి హిట్ అవ్వటంతో ఇటీవల సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో రవితేజ హాజరు కాలేదు. ఇదిలా ఉండగా ఈ ఈవెంట్లో రవితేజ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సినిమాలోని ఒక సన్నివేశం గురించి వివరిస్తూ గోడ మీద ఉన్న రవితేజ పోస్టర్ కి చిరంజీవి ముద్దుపెట్టిన సంగతి గురించి వెల్లడించాడు.

తమ్ముడు స్థానంలో రవితేజ పవన్ కళ్యాణ్ లాగా కనిపించాడని, అందువల్ల ఈ సీన్ చాలా అద్భుతంగా పడిందని చెప్పుకొచ్చాడు. గ్లిజరిన్ లేకుండానే ఈ సీన్లో చాలా ఎమోషనల్ అయ్యానని చిరు వెల్లడించాడు.
అయితే ఈ సినిమాలో రవితేజ పోస్టర్ కి చిరు ముద్దు పెట్టడం గురించి చెబుతూ ఒక పెద్ద హీరో ఇలా చిన్న హీరో పోస్టర్ కి ముద్దు పెట్టడం ఏంటి అని డైరెక్టర్ అడిగాడని చిరు చెప్పుకొచ్చాడు. చిరంజీవి రవితేజ గురించి మాట్లాడుతూ ఇలా చిన్న హీరో అని అనటంతో రవితేజ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi -Raviteja: చిన్న హీరో అంటూ రవితేజ అవమానించిన చిరు..

చిరంజీవి లాగే రవితేజ కూడా స్వయంకృషితో ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజని చిన్న చూపు చూస్తూ చిన్న హీరో అనటంతో రవితేజ అభిమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు, మాస్ మహారాజా అభిమానుల మధ్య వివాదం మొదలైంది. ఇక ఈ వివాదం ఎంతటికీ దారితీస్తుందో చూడాలి మరి.