Tag Archives: meghalaya

ఆ గ్రామంలో మనుషులకు పేర్లు ఉండవు.. కేవలం విజిల్స్ తోనే..!

ఒక గ్రామానికి అయినా.. ఒక మనిషికి అయినా ఏదో ఒక పేరు అనేది ఉంటుంది. అది ఉంటేనే ఆ గ్రామానికి అయినా.. మనిషికి అయినా ఐడెంటిటీ ఉంటుంది. లేదంటే.. ఒక అడ్రస్ లాంటిది ఉండదు. అయితే మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఒక గ్రామానికి చెందిన గ్రామస్తులకు ఎలాంటి పేర్లు లేవు. అదెక్కడో తెలుసా.. మేఘాలయాలోని ఓ గ్రామం.

అక్కడ ఉన్న మనుషుల్లో ఎవరికీ ఎలాంటి పేర్లు లేవు. మరి వాళ్లు కమ్యూటికేట్ ఎలా చేస్తారో అని అందరికీ అనుమానం వస్తుంది. వాళ్లు విజిల్స్ తోనే కమ్యూనికేట్‌ చేసుకుంటారట. ఆ గ్రామం పేరు కాంగ్‌థాన్‌. ఆ గ్రామంలో దాదాపు మొత్తం 700 మంది ఉన్నారు.

మేఘాలయాలోని కాంగ్‌థాన్‌ గ్రామం అనేది.. ఈస్ట్ ఖాసి జిల్లాలో ఉంది. ఇక అక్కడ మొదటి నుంచి కూడా ఈల వేయడం అనేది ఒక ఆచారం అట. వాళ్ల పూర్వికుల నుంచి కూడా ఈ ఆచారం అనేది కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్లోకి ఇక కొత్తవారు వెళ్లారంటే.. ఇక అంతే సంగతులు.. పిచ్చి ఎక్కడమే. ఎవరకి ఏ పేరు పెట్టి పిలవాలో అర్థం కాదు. ఊరు మొత్తం ఈలతోనే మారుమ్రోగుతుంది.

ఆ ఈలలు కూడా ఒకొక్కరికీ ఒక్కో విధంగా పెడతారు. అందులో పక్షుల అరుపులు, సినిమా పాటలోని ట్యూన్లను వాళ్లకు పేర్లు పెట్టి.. ఆ ఈలలతో ఐటెంటిటీ చేస్తుంటారు. అందుకే ఆ గ్రామాన్ని విజిల్ గ్రామం అని కూడా అంటారట. తల్లిదండ్రులకు ఒక ఈల.. కొడుకు, కూతుర్లకు మరో ఈల శబ్ధాలు వినపడుతున్నాయి. మరి వాళ్లకు ఓట్లు.. ఎలా కేటాయించరనేది అర్థం కాని విషయం.

ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఫ్రీ కరోనా టెస్టులు ఉండవా?

ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి విదితమే. భారత్ లో కరోనా కేసుల సంఖ్య, కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికి వైరస్ పూర్తిస్థాయిలో అదుపులోకి రావాల్సి ఉంది. కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం మినహా వైరస్ బారిన పడకుండా మరో మార్గం లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు.

మరోవైపు కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్ల నుంచి దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా కరోనా పరీక్షలను నిర్వహించాయి. కరోనా పరీక్షల కోసం కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని ఖర్చు చేశాయి. అయితే వైరస్ ఉధృతి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకపై ఫ్రీగా కరోనా పరీక్షలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చాయి.

తాజాగా మేఘాలయ ప్రభుత్వం వచ్చే వారం నుంచి కరోనా పరీక్షలపై ఛార్జీలను వసూలు చేస్తామని కీలక ప్రకటన చెసీంది. భారత వైద్య పరిశోధన మండలి ఇప్పటికే కరోనా టెస్టింగ్ కిట్లపై సబ్సిడీని ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో ఈ నెల 16వ తేదీ నుంచి ఛార్జీలు చెల్లించిన వారి శాంపిళ్లను మాత్రమే తీసుకోనున్నారు. ఏ కరోనా పరీక్ష చేయించుకున్నా ఛార్జీలు చెల్లించాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.

అయితే కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నవారు. దారిద్రరేఖకు దిగువన ఉన్నవారు, జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారులకు మేఘాలయ ప్రభుత్వం మినహాయింపును ఇవ్వనుందని తెలుస్తోంది. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుకు 500 రూపాయలు. ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, సీబీఎన్ఏఏటీ టెస్టులకు 3,200 రూపాయలు మేఘాలయ సర్కార్ వసూలు చేయనుందని తెలుస్తోంది.