Tag Archives: Melena Symptoms

Taraka Rathna: తారకరత్నకు సోకిన మెలెనా లక్షణాలు.. అది ఎలా వస్తుందో తెలుసా?

Taraka Rathna: తారకరత్న.. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతున్న పేరు. ప్రస్తుతం తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.. అయితే తారకరత్న త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు అలాగే నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే దేవుళ్లకు పెద్ద ఎత్తున పూజలు కూడా చేస్తున్నారు.

బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తారకరత్న మెలెనా అనే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
జీర్ణశయాంతర రక్తస్రావాన్ని మెలెనా అని పిలుస్తారు. అయితే మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటుగా నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం అవుతుంది. కొన్ని కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద ప్రేగు ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చాలామంది అభిమానులు తారకరత్న బాధపడుతున్న మెలెనా వ్యాధి గురించి దాని లక్షణాల గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేయగా కొన్ని రకాల విషయాలు బయటకు వచ్చాయి.. అయితే మెలెనా వ్యాధి రావడానికి కారణాల విషయానికి వస్తే.. ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తినడం, కడుపులో పుండ్లు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా ఉండడం లేదా రక్తనాళాల్లో వాపు, రక్తస్రావం అలాగే రక్త సంబంధిత వ్యాధుల వల్ల ఈ మెలెనా వ్యాధి వస్తుంది.

Taraka Rathna:శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది….

ఇక ఈ మెలెనా వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. ఈ వ్యాధి సోకిన వారికి మలం నల్లగా, బంక మాదిరి రావడంతో పాటుగా దుర్వాసన విపరీతంగా వస్తుంది. అలలాగే ఈ వ్యాధి వల్ల శరీరంలో రక్త స్థాయి చాలావరకు తగ్గిపోయి రక్తహీనతతో పాటు బలహీనమైపోతారు. కొన్ని కొన్ని సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ మెలెనా వ్యాధి సోకిన వారికి శరీరం లేత పసుపు రంగులోకి మారిపోతుంది. అలసట, విపరీతమైన చెమటలు, గందరగోళం అనిపించడం, అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలుగా చెప్పవచ్చు.