Tag Archives: mettings

Janasena: పవన్ ప్రచార సభలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు.. అందుకే పొత్తు పెట్టుకున్నారంటూ?

Janasena జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో పొత్తు కలిపిన సంగతి మనకు తెలిసిందే.వీళ్ళ పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే సీట్లను తీసుకొని ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ 21 ఎమ్మెల్యే స్థానాలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో పలువురు ఈయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఎన్నికలు దగ్గర్లోనే రాబోతున్నాయి కానీ ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రచార సభను కూడా ఏర్పాటు చేయలేదు. పిఠాపురంలో మాత్రం కొన్ని సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు వచ్చారు. ఇటీవల చిలకలూరిపేట సభకు హాజరయ్యారు తప్ప ఎక్కడ కూడా ఆయన సభ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఇలా ప్రచార కార్యక్రమాల విషయంలో మౌనం వహించడం ఏమాత్రం బాలేదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సభ నిర్వహించాలంటే భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ గెలుపు కోసం ఏమాత్రం కష్టపడటం లేదు.

రూపాయి ఖర్చు లేదు..
తన పార్టీని తెలుగుదేశం పార్టీలోకి పొత్తు కలిపి ఈయన మాత్రం రిలాక్స్ అవుతున్నారని, ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఎన్నికల బరిలోకి రాబోతున్నారని కామెంట్లు చేస్తున్నారు
ఇలాగైతే విజయం ఎలా వరిస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.మీరు ఇలా మౌనంగా ఉండటంతోనే మీరు పొత్తు ఎందుకు పెట్టుకున్నారనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. పొత్తులో భాగంగా డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికలలో పోటీ చేయవచ్చన్న ఆలోచనతోనే పొత్తుకు వచ్చారని అంతకుమించి పార్టీని గెలిపించుకోవాలన్నా నేపథ్యంలో పొత్తు పెట్టుకోలేదు అంటూ పలువురు పవన్ వ్యవహార శైలి పై విమర్శలు చేస్తున్నారు.