Tag Archives: minimum balance

పోస్టాఫీస్ కస్టమర్లకు అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

మనలో చాలామంది పోస్టాఫీస్ లో అకౌంట్ ను కలిగి ఉంటారు. బ్యాంకులతో సమానంగా పోస్టాఫీస్ లు కొత్తకొత్త స్కీమ్ ల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయి. అయితే ఈ నెల 11వ తేదీ నుంచి పోస్ట్ ఆఫీస్ లలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మినిమమ్ బ్యాలన్స్ కు సంబంధించిన నిబంధనలు మారడంతో పోస్టాఫీస్ అకౌంట్ ఉన్న కస్టమర్లపై నిబంధనల ప్రభావం పడనుంది.

ఇకపై పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్న కస్టమర్లు ఖచ్చితంగా మినిమం బ్యాలన్స్ ఉండే విధంగా జాగ్రత్త పడాలి. మినిమం బ్యాలన్స్ లేకపోతే చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల పోస్టాఫీస్ లో అకౌంట్ ఉన్నవాళ్లు మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటివరకు మినిమం బ్యాలన్స్ పోస్టాఫీస్ అకౌంట్లలో ఉంచని వాళ్లు డిసెంబర్ 11 నుంచి కనీసం 500 రూపాయలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎవరైతే కనీసం 500 రూపాయలు మినిమం బ్యాలన్స్ ఉంచరో వాళ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మినిమం బ్యాలన్స్ లేకపోయినా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మినిమం బ్యాలెన్స్ ఉండకపోతే జరిమానా రూపంలో 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జీల నగదు కూడా ఖాతాలో లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

పోస్టాఫీస్ అకౌంట్ ఉన్నవాళ్లకు ఏటీఎం, చెక్ బుక్, మొబైల్ బ్యాంకింగ్ తో పాటు ఇతర సర్వీసులు సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం పోస్టాఫీస్ లు సేవింగ్స్ అకౌంట్ ఉన్నవాళ్లకు 4 శాతం వడ్డీని అందిస్తున్నాయి. 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం జమ చేస్తేనే వడ్డీని పొందవచ్చు. కనీసం ఒక లావాదేవీనైనా గడిచిన మూడు సంవత్సరాల్లో చేసి ఉంటే పోస్టాఫీస్ అకౌంట్ క్లోజ్ కాకుండా ఉంటుంది.