Tag Archives: money investment

Income Plan: రూ.165 పొదుపు చేస్తే..! రూ.11 లక్షలు సొంతం చేసుకోవచ్చు..!

Income Plan: భవిష్యత్ అవసరాల కోసం చాలా మంది డబ్బులను పొదుపు చేసుకోవాలని అనుకుంటుంటారు. కొంతమంది ఆ డబ్బులను ఇన్వెస్ట్ మెంట్ రూపంలో బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే.. మరికొంత మంది వాటిని ఫ్లాట్ లేదా.. భూమి కొనుగోలులో పెడుతుంటారు.

అయితే ఏది ఏమైనా.. దేనిలో ఎన్వెస్ట్ చేసినా రిస్క్ అనేది ఉంటుంది. అయితే బ్యాంక్ లో డిపాజిట్ కు ఎలాంటి రిస్క్ లేకపోయినా.. వడ్డీ అనేది చాలా తక్కువగా వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలనుకున్నే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలను పూర్తిగా తెలుసుకుందాం..

మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీనిలో సిప్ రూపంలో డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. దీంతో మనం ఊహించని రీతిలో లాభాలను పొందొచ్చు. ఉదాహరణకు దీనిలో రోజుకు రూ.165 ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత దాదాపు రూ.11లక్షల వరకు రిటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది.

రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని..


దీనిలో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు 12 శాతం నుంచి 20 శాతం వరకు రాబడి లభిస్తుంది. ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని బట్టి పొందే మొత్తంలో మార్పులు ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. దీనిలో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఆ ఫండ్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో చేరాలంటే కనీసం రూ.500 లతో చేరవచ్చు. దీనిలో చేరే వారు ఈక్విటీ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని చెబతున్నారు. రిస్క్ కు సిద్ధపడి డబ్బులను ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే మంచిదని నిపుణుల సూచన. ఆసక్తి ఉన్నవాళ్లు సమీప బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏజెంట్లను సంప్రదిస్తూ పూర్తి వివరాలను వెల్లడిస్తారు.