Tag Archives: Mosagadu

K Raghavendra Rao : ఆ సినిమాలో చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్ చేస్తే ఇక నన్నెవరు చూస్తారని శోభన్ బాబు వాపోయారు. : రాఘవేంద్రరావు

K Raghavendra Rao : చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నిర్మాత, అతను కొన్ని హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా తెలుగు సినిమాలో ప్రధానంగా తన రచనలతో ప్రసిద్ధి చెందాడు. అతను ఏడు రాష్ట్ర నంది అవార్డులు మరియు ఐదు ఫిలింఫేర్ అవార్డులను సౌత్‌లో పొందాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన చలనచిత్ర జీవితంలో, రాఘవేంద్రరావు రొమాంటిక్, కామెడీ, ఫాంటసీ, మెలోడ్రామా, యాక్షన్ థ్రిల్లర్, జీవిత చరిత్ర మరియు శృంగార చిత్రాలు వంటి బహుళ శైలులలో వందకు పైగా చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

రాఘవేంద్రరావు తన సినీ జీవిత పరంపరలో అందాల నటుడు శోభన్ బాబుతో కూడా కొన్ని చిత్రాలను రూపొందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. రాఘవేంద్రరావు మొదటగా శోభన్ బాబుతో 1975లో “బాబు” చిత్రం విడుదలయ్యింది. ఆ తర్వాత రాజా, రాధాకృష్ణ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో “మోసగాడు” చిత్రం 1980లో విడుదలైంది. చిరంజీవి అప్పటికి తెలుగు తెరకు పరిచయమై రెండు సంవత్సరాలు మాత్రమే గడిచింది. హీరో, విలన్, సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో తెరపై కనిపిస్తూ తనను తాను చిరంజీవి నిరూపించుకుంటున్న రోజులవి.. చూడడానికి ఎర్రటికళ్ళు, ఫైట్స్, డాన్స్ బాగా చేస్తున్నాడని సినీ పరిశ్రమలో పలువురు అనడం లాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు రాఘవేంద్రరావు మోసగాడు చిత్రంలో ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రకి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు హీరో శోభన్ బాబుకి చెప్పారు.

చిరంజీవి డాన్స్, ఫైట్లు బాగా చేస్తున్నాడని శోభన్ బాబు కూడా ఇదివరకే గమనించారు. అలాంటప్పుడు మోసగాడు చిత్రంలో అతనిని తీసుకొని శ్రీదేవితో స్టెప్పులు, వేయించి ఫైట్స్ గనుక చేసినట్లయితే ఇక ఆ సినిమాలో తనను ఎవరు చూస్తారని దర్శకుడు రాఘవేందర్రావుతో నిర్మోహమాటంగా శోభన్ బాబు అడిగారు. దానికి చిరునవ్వు నవ్విన దర్శకుడు.. చిరంజీవిది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రని.. ఆ పాత్రతో హీరోకి వచ్చిన నష్టం ఏమీ ఉండదని చెప్పడంతో శోభన్ బాబు ఆ విషయంలో కన్విన్స్ అయ్యారని ఒక సందర్భంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆనాటి గత స్మృతులను ఒక్కసారి రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు.