Tag Archives: mosagallaku mosagadu

హాఫ్ సెంచరీ కొట్టిన ‘మోసగాళ్లకు మోసగాడు’.. అప్పట్లో భారీ బడ్జెట్.. సూపర్ హిట్ టాక్ అయినా నష్టాలే..

పద్మాలయా ఫిలింస్ బ్యానర్‌లో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకం గా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ చిత్రం విడుదలై నేటికి అంటే ఆగస్టు 27 నాటికి 50 సంవత్సరాలు. ఇది ఆగస్టు 27, 1971 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో పెద్ద బంపర్ హిట్ కొట్టేసింది.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చుకుంది. భారతదేశంలో తొలి కౌబాయ్ చిత్రం కావడం కూడా విశేషం. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలలో ప్రదర్శింపబడి ప్రకంపనలు సృష్టించింది. పాన్ ఇండియా సినిమాలు అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో ఏ మాత్రం గ్రాఫిక్స్ లేకుండా సినిమాను తీయలేకపోతున్నారు. కానీ ఆ రోజుల్లోని ఇలాంటి పాన్ ఇండియా సినిమాతీసి సంచలనం స్పష్టించారు. ఆ సినిమాతో సూపర్ స్టార్ కృష్ణను అభిమానులు ఆంధ్రా జేమ్స్‌బాండ్ అని పిలవడం మొదలు పెట్టారు.

మరో విశేషం ఏంటంటే.. పద్మాలయా సంస్థ కూడా రూపొందించబడి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. హిందీ, తమిళం, ఇంగ్లీష్‌తో పాటు రష్యన్, స్పానిష్‌తో పలు భాషల్లో డబ్ చేయబడింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలైన తర్వాత కొన్నాళ్లకు కొన్ని థియేటర్లలో మళ్లీ విడుదల చేశారు. అప్పుడు కూడా విజయవంతంగా రన్ చేయబడిన చిత్రం మోసగాళ్లకు మోసగాడు. ఈ సినిమాను అప్పట్లో రూ. 6 లక్షల 70 వేలతో రూపొందించారు. అయితే ఆ సమయంలో నాన్ థియేట్రికల్ రైట్స్ పెద్దగా వచ్చేవి ఏమీలేకపోవడం ఒక పెద్ద మైనస్ అయింది. ఇక సినిమా రూ.4.5 లక్షలకు విక్రయించారు. దీనితో అప్పట్లోనే సూపర్ స్టార్ కృష్ణ సొంత బ్యానర్ కావడంతో రూ.2.5 లక్షల వరకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రానికి ఆది నారాయణ రావు సంగీతం అందించగా.. వి.యస్.ఆర్.స్వామి సినిమాటోగ్రఫీ అందించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 1972 సంవత్సరంలో రష్యాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శింపబడింది.