Tag Archives: motorists

వాహనదారులకు షాక్.. ఇక నుంచి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే..

డ్రైవింగ్ చేయడం ఎంత ముఖ్యమో.. వాహనదారులు వాహననిబంధనలు పాటించడం కూడా అంతే అవసరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లింఘిచిన వారికి పోలీసులు చాలన్ల రూపంలో వసూలు చేస్తున్నారు.

అంతే కాకుండా.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇక అంతే సంగతి. వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వాహనదారుడుపై పలు రకాల సెక్షన్ల తో పాటు శిక్షను అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవి అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు డ్రండ్ డ్రైవ్ లో పట్టుబడిని వారికి మాత్రమే పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించే వారు.. కానీ ఇక నుంచి అలా ఉండదు.

అదే కౌన్సెలింగ్ ను ఇప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి సైతం అమలు చేయనున్నారు. దీనికి ట్రాఫిక్ పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఏదైనా వాహనానికి 10 చలాన్ల కంటే ఎక్కువగా పెండింగ్ లో ఉన్న వాహనదారులకు ఇలాంటి శిక్షను అమలు చేయనున్నారు. అటువంటి వాహనదారులను పలిచి కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు.

ఈ కౌన్సెలింగ్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లింఘిస్తే ఎలాంటి తప్పులు జరుగుతాయి.. ఎలాంటి ప్రమాదాలకు కారణం అవుతారు అనే వాటిపై అవగాహన కల్పించనున్నారు. ట్రిఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో పోలీసులు ఇలాంటి చర్యలకు తీసుకోనున్నట్లు తెలియజేశారు.