Tag Archives: Mouth Ucler

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..

ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నావనేది కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది చూస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేసుకోగలరు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొంతమందికి శరీరంలో వేడి కారణంగా నోట్లో పూత సమస్య ఏర్పడుతుంటుంది.

వాటిని వేడి పొక్కులు అని కూడా అంటారు. ప్రతీ ఒక్కరికీ ఈ సమస్య అనేది ఉంటుంది. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇలా రావడం వల్ల తిన్న ఆహారం రుచిగా ఉందా..లేదా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి చెక్ పెట్టవచ్చు. దాని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం.. ఆ పొక్కులు ఏర్పడిన చోటు కాస్తంత నెయ్యిని రాస్తే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

బియ్యం కడిగిన నీటిని తీసుకొని దానిలో కొంత కలకండ్ కలిపి రోజులో చిన్న గ్లాసు తీసుకుంటే నోటి పూత సమస్య తగ్గుతుంది. పటిక బెల్లం కూడా నోటి పూత సమస్య నుంచి ఉపషమనం కలిగిస్తుంది. కొత్తిమీర ఆకులను బాగా నూరి.. ఆ రసాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊస్తే.. నోటిపూత అనేది మాయం అయిపోతుంది. అయితే దీనిని క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి చేసి ఊరుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని గమనించాలి.

వాటితో పాటు తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఎక్కవగా జీర్ణం అయ్యే ఆహార పదర్థాలను తీసుకోవాలి. మాంసాహారాన్ని తీసుకోకపోవడమే మంచిది అంటూ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆహారం తిన్న తర్వాత నోట్లో కొన్ని నీళ్లు పోసుకొని పుక్కిలించి ఊయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన విధంగా పాటిస్తే.. పూత సమస్య ఉండదు.