Tag Archives: mumbai municipal corporation

ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలోకి రూ.500 జమ.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి అధికమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వారాంతపు లాక్ డౌన్ లోడ్ అమలుచేసే కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. కరోనా ఉధృతి అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలు మూతబడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పాఠశాలల యజమానులు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నారు.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్కూలు తెరచుకొనే అవకాశాలు కనిపించడం లేదు.త్వరలోనే స్కూలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది కూడా ఆన్లైన్ ద్వారానే తరగతులు నిర్వహించే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించడంతో ఎంతో మందికి ఇంటర్నెట్ సమస్యలు వేధిస్తోంది.

చాలా మంది తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్(NMMC) కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంటర్నెట్ రీఛార్జ్ కోసం ప్రతి ఒక్క విద్యార్థి పేరెంట్స్ ఖాతాలోకి రూ.500 అందించాలని నిర్ణయించుకుంది.

మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చదివే సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఐదు వందల రూపాయలు జమ చేయడం ద్వారా మూడు నెలలకు సరిపడా ఇంటర్నెట్ రీచార్జ్ చేసుకొని తరగతులకు హాజరు కావచ్చని మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య అధికారి అభిజిత్ తెలిపారు. 40 వేల మంది విద్యార్థులు సుమారు 16 వందల మందికి స్మార్ట్ ఫోన్లు కూడా లేవు అనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అభిజిత్ తెలియజేశారు.