దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి అధికమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ విధించాయి. మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు,వారాంతపు లాక్ డౌన్ లోడ్ అమలుచేసే కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. కరోనా ఉధృతి అధికమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలు మూతబడిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పాఠశాలల యజమానులు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహిస్తున్నారు.
కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్కూలు తెరచుకొనే అవకాశాలు కనిపించడం లేదు.త్వరలోనే స్కూలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కరోనా తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఈ ఏడాది కూడా ఆన్లైన్ ద్వారానే తరగతులు నిర్వహించే సూచనలు కనబడుతున్నాయి. అయితే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించడంతో ఎంతో మందికి ఇంటర్నెట్ సమస్యలు వేధిస్తోంది.
చాలా మంది తల్లిదండ్రులకు స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే ముంబాయి మున్సిపల్ కార్పొరేషన్(NMMC) కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇంటర్నెట్ రీఛార్జ్ కోసం ప్రతి ఒక్క విద్యార్థి పేరెంట్స్ ఖాతాలోకి రూ.500 అందించాలని నిర్ణయించుకుంది.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చదివే సుమారు 40 వేల మంది విద్యార్థులకు ఐదు వందల రూపాయలు జమ చేయడం ద్వారా మూడు నెలలకు సరిపడా ఇంటర్నెట్ రీచార్జ్ చేసుకొని తరగతులకు హాజరు కావచ్చని మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్య అధికారి అభిజిత్ తెలిపారు. 40 వేల మంది విద్యార్థులు సుమారు 16 వందల మందికి స్మార్ట్ ఫోన్లు కూడా లేవు అనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు.ఈ సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అభిజిత్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…