దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగుల పట్ల మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఏ ఉద్యోగి అయినా మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను తీర్చే విధంగా అడుగులు వేస్తోంది. విధులు నిర్వహిస్తూ ఉద్యోగి మరణించిన కేవలం నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ చెల్లించాలని నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వారి కుటుంబం నుంచి వచ్చిన క్లెయిమ్ వెంటనే నెల వ్యవధిలో గా ఆ కుటుంబానికి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.పాత పెన్షన్ పథకం, జాతీయ పెన్షన్ కింద ఉండి మరణించిన ప్రభుత్వ ఉద్యోగికి అందాల్సిన మొత్తాన్ని ఆ కుటుంబానికి అందించాలని తెలిపింది.
ఈ క్రమంలోనే ఉద్యోగి చెల్లించిన మొత్తాన్ని ఎన్‌పీఎస్ పెన్షన్ కార్పస్ ను కుటుంబ సభ్యులకు వెంటనే అందించడమే కాకుండా పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తున్న సమయంలోనే ఉద్యోగి శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్యను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 2020 జనవరి 1 నుంచి మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల పింఛన్ జారీ, ఇతర వివరాలను నెలవారీగా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…