Tag Archives: nageshwar

AP politics: బాబుని సీఎం చేయటం మోడీ అజెండా కాదు.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణ!

AP politics: ప్రస్తుతం జరగబోయే ఏపీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగ మారాయి. జగన్ ఒక్కడే ఒక వైపు ఉండగా మరోవైపు జనసేన టిడిపి బిజెపి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి రాబోతున్నారు. ఇలా ఈ పార్టీలన్నీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో మొదటిసారి చిలకలూరిపేట వద్ద ప్రజాగళం అనే పేరిట భారీ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి పై ఎలాంటి విమర్శలు చేస్తారో అన్న విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు .అయితే ఈ సభలో మోడీ చేసిన వ్యాఖ్యల గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సభలో మోడీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అంటూ ఈయన తెలిపారు. ఎక్కడ కూడా జగన్ గురించి మాట్లాడలేదు అలాగే రాజధానుల ప్రస్తావన తీసుకురాలేదు పోలవరం గురించి ప్రశ్నించలేదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వంలోని మంత్రుల గురించి మాట్లాడారే తప్ప జగన్ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు అలాగే తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయాలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. ఎన్డీఏకి ఓట్లు వేసి గెలిపించండి అని మాత్రమే కోరారని నాగేశ్వరరావు తెలిపారు. ఇక్కడ మోడీ గారికి చంద్రబాబు నాయుడుని గెలిపించడమే అజెండా కాదని ఈయన తెలిపారు.

జగన్ పై ఎక్కడ విమర్శలు చేయలేదు..
రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అలాగే జగన్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా మోడీకి అవసరం కనుక ఈయన ఎక్కడ కూడా జగన్ కు ఓటు వేయొద్దని చంద్రబాబుకు ఓటు వేసి గెలిపించండని చెప్పలేదు. చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలి అనే అజెండా కనుక ఉండి ఉంటే ఈ సభలో జగన్ పై విమర్శలు చేసేవారు కానీ మోడీ ఎక్కడ కూడా అలా ప్రసంగించలేదు అంటూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన అనాలసిస్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Kavitha: కవిత అరెస్టు వెనుక ఇంత కథ ఉందా.. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కామెంట్స్ వైరల్!

Kavitha: త్వరలోనే ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఒక్కసారిగా రాజకీయాలలో పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది. కవిత నివాసంలో దాదాపు 4 గంటల పాటు సోదాలు జరిపిన ఈడీ అధికారులు.. మనీలాండరింగ్ కింద కవితను అరెస్టు చేసి తీసుకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే కవిత అరెస్టు రెండు రాష్ట్ర రాజకీయాలలో కూడా సంచలనంగా మారాయి.

పార్లమెంట్ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి తరుణంలో కవిత అరెస్టు కావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కాంగ్రెస్ బిజెపిలకు కలిసి ఈ కుట్రను ప్రోత్సహించాయని బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కవిత అరెస్టు వెనుక ఉన్నటువంటి కారణాలను రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బిజెపితో పొత్తుకు గతంలో బిఆర్ఎస్ అనుకూలంగా వ్యవహరించలేదు త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి తిరగాలి అంటే కవితను అరెస్టు చేయాల్సిందేనని భావించి తనను అరెస్టు చేశారు తాను గతంలో కూడా ఈ విషయం గురించి పలు సందర్భాలలో మాట్లాడినట్లు ఈయన గుర్తు చేశారు.

కవిత అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమ..
ఒకవేళ బిజెపి పొత్తు కనుక పెట్టుకుంటే బారాసతో పొత్తు పెట్టుకోవాలని లేకపోతే కవిత అరెస్టు అవుతుందని ఈయన గతంలో తెలిపారు అయితే కవిత అరెస్టు వెనక కేవలం రాజకీయ కుట్ర మాత్రమే ఉందని ఈయన వెల్లడించారు. ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేయడం వెనుక మరే ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేయడం వెనుక ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే సమయంలో ఆమెను అరెస్టు చేశారు నాకు తెలుసు ఆమెకు బెయిల్ కూడా ఇవ్వకపోవచ్చు అని ఈయన తెలిపారు.