Tag Archives: narasimha raju

Narasimha Raju : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆంధ్రా కమల్ హాసన్‌.. నరసింహరాజు..!

Narasimha Raju : జానపద, పౌరాణిక చిత్రాలు అంటే వెంటనే గుర్తకువచ్చే తెలుగు కథానాయకుడు నరసింహ రాజు. 70వ దశకంలో చాలా వరకు విజయవంతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు ఈయన. 1974లో నీడలేని ఆడది సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నరసింహ రాజు ఆ తరువాత విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని సినిమాతో మంచి క్రేజున్న హీరోగా గుర్తింపు పొందారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో కమలహాసన్‌కు ఉన్నంత స్టార్‌డమ్ ఉండేది నరసింహ రాజుకు. తెలుగు చిత్ర పరిశ్రమలో నరసింహరాజును ఆంధ్రా కమల్ హాసన్‌గా పేరు సంపాదించుకున్నారు. 

సుమారు 110 చిత్రాల్లో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తెలుగు తెరపై తన ఛరిష్మాను కొనసాగించారు ఈయన. దాదాపు ఆయన అప్పట్లో నటించిన అన్ని సినిమాలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. చాలా మంది ప్రముఖ నటులతో సమానంగా నటించారు. జగన్మోహినితోపాటు పునాదిరాళ్లు, పున్నమినాగు, నీడలేని ఆడది, ఇలా చాలా సినిమాలు ఆయన సినీ జర్నీలో మైలురాయిగా నిలుస్తాయి. ఈయన నటించిన పౌరానికమే కాదు ఆధ్యాత్మికమైన సినిమాలు ప్రేక్షకాధరణ పొందాయి. 
అయితే కొంత కాలం సినీ ఇండస్ట్రీకి దూరం కావడంతో మంచి అవకాశాలను పోగొట్టుకున్నారు.

Narasimha Raju : పున్నమి నాగు చిత్రంలో చిరంజీవి తో కలిసి నటించిన నరసింహరాజు

పున్నమి నాగు సినిమాలో నరసింహ రాజుతో సమానంగా నటించిన చిరంజీవి ప్రస్తుతం మెగాస్టార్‌గా స్టార్‌డమ్‌ సంపాదించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడం వల్ల ఆయన అంతటి క్రేజ్‌ను సంపాదించుకోలేకపోయారు. తరువాత బుల్లతెరపైన సీరియళ్లలో నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టారు. ఎండమావులు, పంజరం, సుందరకాండ వంటి సీరియల్స్ మంచి ప్రేక్షాధరణ పొందాయి.

అప్పట్లో జానపద బ్రహ్మగా పేరుతెచ్చుకున్న బి.విఠలాచార్య జగన్మోహిని సినిమాను తన సొంత బ్యానెర్‌పై రూపొందించారు. ఇందులో హీరోగా నరసింహ రాజు  నటించారు. ఆ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి వేరే జానపద చిత్రాలు లేకపోవడం ఈ చిత్రంలో నటించిన కళాకారులు ఉత్తమ ప్రతిభను చూపించడంతో జగన్మోహిని చిత్రం బంపర్ హిట్‌ను సాధించింది. అప్పటికీ నరసింహ రాజుకు హీరో ఇమేజ్ లేదు. కానీ ఈ సినిమా హిట్‌తో ఆయన ఫేట్ మొత్తం మారిపోయింది. పాతివ్రత్యం, అద్భుత శక్తులు, దేవతలు, దెయ్యాలు, భక్తి వంటి ఇతివృత్తాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించింది. దెయ్యం వలలో పడిన భర్తగా నరసింహరాజు నటన ఆధ్యంతం అందరినీ అలరిస్తుంది. హీరోయిన్ ప్రభ కూడా తెరకు కొత్త కావడంతో ఈ చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. పి.సుశీల, ఎస్‌.జానకి, ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అప్పటి బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపాయనడంలో సందేహం లేదు.

అప్పట్లో తమిళంలో సూపర్‌ హిట్ సాధించిన చిత్రం అపూర్వ రాగంగళ్. ఈ సినిమాలో కమల్ హాసన్, రజనీకాంత్, జయసుధ నటించారు. ఈ చిత్రం తమిళంలో హిట్ కావడంతో ఇదే సినిమాని దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తూర్పు పడమర టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో సత్యనారాయణ, నరసింహరాజు, శ్రీవిద్య, మాధవిలు, జయసుధ నటించారు. బేతాళ కథల్లో జవాబులేని ఆఖరి ప్రశ్న వంటి కథాంశంతో తెరకెక్కి ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. బాలచందర్ మిగతా చిత్రాల మాదిరిగానే ఇది కూడా ఓ పజిల్ సినిమా. శ్రీ రమణ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. 

ఇందులో శివరంజనీ, స్వరములు ఏడైనా రాగాలెన్నో వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. 1980లో వచ్చిన పున్నమినాగు సినిమాలోనూ తన నట విశ్వరూపాన్ని చూపించారు. చిరంజీవి, నరసింహరాజు, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్ర దారులుగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో భారీ కలెక్షన్‌లను రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్ తో సాగిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆధ్యంతం అలరించింది. ఇలాంటి చాలా చిత్రాల్లోనే నరసింహ రాజు నటించారు. ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.