Tag Archives: no DA hike

పెన్షన్ తీసుకునే వాళ్లకు, ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..?


గత కొన్ని నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని అన్ని వర్గాలకు, అన్ని రంగాలకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు, పెన్షన్ తీసుకునే వారికి శుభవార్త చెప్పింది.

కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం ఆదాయం కూడా తగ్గిన నేపథ్యంలో కేంద్రం గతంలో ఈ సంవత్సరం డీఏ పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అయితే దేశంలో కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గడం పరిస్థితుల మార్పు నేపథ్యంలో డీఏ పెంపు అమలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 శాతం డీఏ పెరగనుందని సమాచారం.

2021 సంవత్సరం జులై నుంచి డీఏ పెంపు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే కేంద్రం ఈ విషయం గురించి స్పందించకపోవడంతో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. డీఏ పెంపు నిర్ణయాన్ని కేంద్రం అమలు చేస్తే దేశంలోని 50 లక్షల మందికి ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు పాత డీఏనే లభిస్తోంది.

అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే డీఏ పెంపు గురించి కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది.