Tag Archives: no drink for no vaccine

మందుబాబులకు షాక్.. వ్యాక్సిన్ వేయించుకోని వారికి మద్యం లేదంటూ?

కరోనా మహమ్మారి కొన్ని వేల కుటుంబాలను చీకటిబయం చేసింది. ఎంతో మంది విధి లేక రోడ్డున పడ్డవారు కూడా ఉన్నారు. కరోనా నియంత్రణకు కేవలం నివారణ ఒక్కటే మార్గం అని వైద్యులు, అధికారులు మొదటి నుంచి చెబుతున్నారు.

కచ్చితంగా మాస్క్, శానిటైజర్లను ఉపయోగించాలని.. కరోనా నిబంధనలు పాటించాలిన చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చినదగ్గర నుంచి కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తోంది. థర్డ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకున్నట్లే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు.. తమిళనాడు లోని మైలాడుతురై జిల్లా అధికార యంత్రాంగం మందుబాబులకు షాక్ ఇచ్చింది.

తమిళనాడు ప్రభుత్వం నియంత్రణలో ఉన్న టాస్మాగ్ దుకాణాలలో మద్యం కొనుగోలు చేసేవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపెట్టాలనే నిబంధన పెట్టింది. ప్రజలు ఈ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని.. కోవిడ్-19 రహిత జిల్లాగా మార్చేందుకు తోడ్పడాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో మద్యం ప్రియులు కొంత మంది టెన్షన్ పడుతున్నారు.

మద్యం తాగడం అలవాటుగా మారిన వారు సడన్ గా ఇళా బంద్ చేస్తే తట్టుకోలేరు. కనుక వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు మద్యం దుకాణాలకు కాకుండా.. ఇక వ్యాక్సిన్ కేంద్రాలకు పరుగు పెడుతున్నారు. మందుబాబులకు కాస్తంత అసహనం అనిపించినా.. ఈ ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా చేస్తే బాగుంటదని అభిప్రాయపడుతున్నారు.