Tag Archives: NTR a public leader

Sr NTR: ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన నా దేశం.. ఎన్టీఆర్ ను ప్రజానాయకుడిగా మార్చిన సినిమా !

Sr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నందమూరి తారక రామారావు. ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అవలీలగా పరకాయ ప్రవేశం చేసి ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అన్నగారు రాజకీయాలలో కూడా అదే పేరు ప్రఖ్యాతలు పొందారు. ఇకపోతే ఈయన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి కానీ ఈయన రాజకీయ ప్రస్తానానికి పునాదిగా నిలిచిన చిత్రం నా దేశం.

ఈ విధంగా ఎన్టీఆర్ నటించిన నా దేశం సినిమా 1982 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘నాదేశం’ 2022 అక్టోబర్ 27 నాటికి 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.మరి 40 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విశేషాలు ఏమిటి ఈ సినిమా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్తానానికి ఏ విధంగా సహాయపడింది అనే విషయానికి వస్తే..

ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని భావించిన ఈయన 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. ప్రజల్ని చైతన్య పరచడానికి ప్రజలలోకి తన పార్టీని తీసుకు వెళ్లడానికి చాలా తక్కువ సమయం ఉంది ఇలా రాజకీయపరంగా ఎన్టీఆర్ బిజీ అవుతున్న నేపథ్యంలో ఆయనకు కాల్ షీట్స్ ఇచ్చినటువంటి నిర్మాతలు ఆయన ముందు నిలబడి సినిమా చేయాలని అతనిపై ఒత్తిడి తీసుకువచ్చారు.

17 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న నా దేశం…
ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అమితాబచ్చన్ నటించిన లావారిస్ సినిమా రైట్స్ కొనుగోలు చేసి ఈ సినిమాని తెలుగు నేటివిటీకి అనుకూలంగా పరుచూరి బ్రదర్స్ నా దేశం అనే సినిమాని తయారు చేశారు. కె. బాపయ్య దర్శకత్వంలో… పల్లవి దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టింది. ఈ సినిమా 1982 జూలై 22వ తేదీ హైదరాబాదులో షూటింగ్ ప్రారంభించుకొని కేవలం 17 రోజులలో మాత్రమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇలా 40 లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా కోట్ల రూపాయల వసూలు రాబట్టింది.

Sr NTR:

ఈ సినిమా విడుదలైన 70 రోజులకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 10 కేంద్రాలలో నా దేశం సినిమా శత దినోత్సవ వేడుకలను జరుపుకుంది.ఇలా ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి పునాది వేసిన సినిమాలలో నా దేశం సినిమాకి ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి. అయితే ఈయన సినీ కెరియర్ లో ఎన్నో ఇలాంటి పొలిటికల్ సినిమాలు వచ్చినప్పటికీ నా దేశం సినిమా మాత్రం ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.