Tag Archives: operators

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

Call Recordings:. టెలీ కమ్యూనికేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి కాకుండా రెండేళ్ల పాటు కాల్ రికార్డింగుల డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది కేంద్రం. గతంలో ఇది ఒకే ఏడాది మాత్రమే ఉంది. టెలికాం సంస్థలతో పాటు కమర్షియల్, ఇతరత్రా కాల్స్ వివరాల రికార్డులను మెయింటెన్ చేయాలని.. ఇందుకోసం ఏకీకృత లైసెన్స్ ఒప్పందంలో సవరణలు
చేసింది.

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

భద్రత పరంగా వచ్చిన అభ్యర్థనల మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.  కాల్ రికార్డ్ వివరాలతో పాటు, ఎక్స్ ఛేంజ్ వివరాలను, ఐపీ వివరాలను రెండేళ్ల పాటు భద్రపరచాలని ఆదేశించింది. సాధారణ కాల్స్ తో పాటు ఇంటర్నెట్ కాల్స్ డేటాను రికార్డ్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది.

Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!

ఇది కేవలం విధానపరమైన నిర్ణయం అని .. రెండేళ్ల పాటు రికార్డులు ఉంటే.. భద్రతా పరమైన విషయాలకు కీలకంగా మారుతాయని.. రెండేళ్ల డాటా తమకు అవసరమని.. భద్రతా సంస్థలు తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

12 నెలలు కోరితే.. 18 నెలలు ఉంచారు:

గతంలో ప్రభుత్వ కాల్ రికార్డులను 12 నెలల వరకు ఉంచాలని కోరితే.. మేం 18 నెలల వరకు ఉంచామని.. ఇప్పుడు ఆ నియమాలను మార్చారని.. చట్టబద్దమైన సంస్థలు కోరితే డేటాను మరింత కాలం ఉంచుతామని.. మిగిలినవన్నింటినీ కేవలం 45 రోజుల్లో తొలగిస్తామని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలిపారు. కాల్ డేటాను టెక్స్ రూపంలో టెలికాం సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎవరికి కాల్ చేశారు. ఏంఏం మాట్లాడరనేది ఇందులో టెక్స్ రూపంలో భద్రపరుస్తామని తెలిపారు. అయితే దీని వల్ల వినియోగదారుడికి నష్టం ఉండదని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.