Call Recordings: మీ కాల్ రికార్డింగ్స్ వాళ్ల చేతిలోకి..! ఇకపై ఆపరేటర్స్ కు కొత్త రూల్స్..!
Call Recordings:. టెలీ కమ్యూనికేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరి కాకుండా రెండేళ్ల పాటు కాల్ రికార్డింగుల డేటాను భద్రపరచాలని టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది కేంద్రం. గతంలో ఇది ఒకే ఏడాది మాత్రమే ఉంది. టెలికాం సంస్థలతో పాటు కమర్షియల్, ఇతరత్రా కాల్స్ వివరాల రికార్డులను మెయింటెన్ చేయాలని.. ఇందుకోసం ఏకీకృత లైసెన్స్ ఒప్పందంలో సవరణలు
చేసింది.
భద్రత పరంగా వచ్చిన అభ్యర్థనల మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డిసెంబర్ 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కాల్ రికార్డ్ వివరాలతో పాటు, ఎక్స్ ఛేంజ్ వివరాలను, ఐపీ వివరాలను రెండేళ్ల పాటు భద్రపరచాలని ఆదేశించింది. సాధారణ కాల్స్ తో పాటు ఇంటర్నెట్ కాల్స్ డేటాను రికార్డ్ చేయాలని నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇది కేవలం విధానపరమైన నిర్ణయం అని .. రెండేళ్ల పాటు రికార్డులు ఉంటే.. భద్రతా పరమైన విషయాలకు కీలకంగా మారుతాయని.. రెండేళ్ల డాటా తమకు అవసరమని.. భద్రతా సంస్థలు తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ప్రభుత్వ కాల్ రికార్డులను 12 నెలల వరకు ఉంచాలని కోరితే.. మేం 18 నెలల వరకు ఉంచామని.. ఇప్పుడు ఆ నియమాలను మార్చారని.. చట్టబద్దమైన సంస్థలు కోరితే డేటాను మరింత కాలం ఉంచుతామని.. మిగిలినవన్నింటినీ కేవలం 45 రోజుల్లో తొలగిస్తామని టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మీడియాకు తెలిపారు. కాల్ డేటాను టెక్స్ రూపంలో టెలికాం సర్వీస్ కంపెనీలు చెబుతున్నాయి. ఎవరికి కాల్ చేశారు. ఏంఏం మాట్లాడరనేది ఇందులో టెక్స్ రూపంలో భద్రపరుస్తామని తెలిపారు. అయితే దీని వల్ల వినియోగదారుడికి నష్టం ఉండదని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…