Sai Pallavi: సినిమాల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నా ఐటెం సాంగ్స్ ఉన్న ప్రత్యేకతే వేరు. ఐటెం సాంగ్ ఓ రేంజ్ ఉంటే సగం సినిమా హిట్ అయినట్లే అని భావించే రోజులివి. ముఖ్యంగా పేరున్న హీరోయిన్ సాంగ్ చేసిందా… ఆ పాటకు విపరీతంగా క్రేజ్ ఏర్పడుతుంది.
హిందీలో చాలా రోజుల నుంచి హీరోయిన్లు ఐటెం సాంగ్ లు చేస్తున్నారు. తాజాగా తెలుగులో కూడా ఐటెం సాంగ్స్ కి పేరున్న హీరోయిన్లను రికమండ్ చేస్తున్నారు. తాజాగా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ’’ఊ అంటావా మావా..ఊఊ అంటావా..‘‘ ఎంత హిట్టయిందొ అందరికి తెలుసు. ఈ సాంగ్లో సమంత అందాలు, దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ కలిసి సాంగ్ పెద్ద హిట్ అయింది.
అయితే ఐటెం సాంగ్స్ ట్రెండ్స్ కొనసాగుతున్న ఈసమయంలో సాయి పల్లవి ఐటెం సాంగ్స్ పై కీలక కామెంట్లు చేసింది. అయితే ఇటీవల నానితో నటించిన శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో సాయిపల్లవి సందడి చేసింది. సినిమాను హిట్ చేసేందుకు శ్యాంసింగరాయ్ సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్లను చేసింది. అయితే ఈ సమయంలో సాయిపల్లవికి ఐటెం సాంగ్స్ ఆఫర్ వస్తే ఏం చేస్తుందనే క్వశ్చన్ ఎదురైంది.
అయితే ఈ ప్రశ్నకు అమ్మడు తన దైన శైలిలో సమాధానం ఇచ్చింది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని.. అయితే సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరు. ఐటెం సాంగ్స్ కు డ్యాన్స్ చేయడం వేరని.. ఐటెం సాంగ్స్ లో స్కిన్ షో తప్పదని, అది నాకు నప్పదని చెప్పేసింది. కాజల్, సమంత, తమన్నాలా నేను ఐటెం సాంగ్స్ చేయలేనని కుండ బద్దలు కొట్టేసింది సాయిపల్లవి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…