Madhavan: మాధవన్ టాలెంటెడ్ యాక్టర్.. హిందీలో అయినా.. తెలుగు, తమిళంలో అయినా తనకు మంచి క్యారెక్టర్ పడాలే కానీ.. యాక్టింగ్ తో దుమ్మురేపుతుంటాడు. తాజాగా ఓటీటీలో కూడా తన సత్తా చాటాడు. మాధవన్, సుర్వీన్ చావ్లా నటించిన కొత్త వెబ్ సరీస్ ‘డీకపుల్డ్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ వెబ్ సీరిస్ కు మంచి స్పందన వస్తోంది. చాలా దేశాల్లో టాప్ 10 వెబ్ సీరీసుల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ వార్తను హీరో మాధవన్ నే స్వయంగా చెప్పాడు. మన దేశంలో ఈ వెబ్ సిరీస్ టాప్ 2 లో ఉందని తెలిపాడు. దీనికి సంబంధించి ట్విట్ కూడా చేశారు మాధవన్. దీంతో వెబ్ సిరీస్ పెద్దహిట్ కావడంతో సంతోషంలో ఉన్నాడు. చాలా మంది మాధవన్ ఫ్యాన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ వాళ్లవాళ్ల దేశాల్లో ట్రెండింగ్ ఉందంటూ.. ట్విట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్ పై కొంత మంది విమర్శలు కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మాధవన్ ట్విట్ చేసిన ఫోటోలో ప్రస్తుతం ఓ విషయం బయటపడింది. దీంతో మాధవన్ ఇవి కూడా చూస్తారా..? అంటూ చెవులు కొరుక్కుంటున్నారు అభిమానులు. మాధవన్ ట్విట్ చేసిన నెట్ ఫ్లిక్స్ ఫోటోలో ఆయన గతంలో చూసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కనిపించాయి. వాటిలో జాన్వీకపూర్ నటించిన ‘గుంజన్’, ఆ తర్వా తి రెండు సినిమాలు ‘365 డేస్’, ‘ఫిఫ్టీ షేడ్ష్ ఆఫ్ గ్రే’.
అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలే హాట్ టాపిక్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఏరోటిక్ మూవీస్ లో ఆరెండు సినిమాలు మంచి ప్రాధాన్యత సంపాదించుకున్నాయి. అయితే మాధవన్ ఇలాంటి సినిమాలు కూడా చూస్తారా అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే సినిమాలు చూడటంతో తప్పు లేదు.. అయితే ఇవి కనిపించేలా స్క్రీన్ షాట్ తీయడం ఎందుకు అంటున్నారు నెటిజెన్లు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…