Featured

WWW (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు) సినిమా రివ్యూ!

కె.వి.గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా.రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించన చిత్రం WWW( ఎవరు,ఎక్కడ,ఎందుకు). ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్,ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. తెలుగులో వస్తున్న ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది.

WWW సినిమా రివ్యూ?

కథ : విశ్వ(అదిత్ అరుణ్), అష్రఫ్(ప్రియదర్శి), మిత్ర ( శివాని రాజశేఖర్ ), చిష్ట్రీ(దివ్య శ్రీపాద) నలుగురు మంచి స్నేహితులు. వీరంతా వేరు వేరు నగరాల్లో ఉంటూ కంప్యూటర్ లోనే వర్చువల్ గా మాట్లాడుకుంటూ సరదాగా చిల్ అవుతూ వుంటారు. చిష్ట్రీ కి మిత్ర(శివాని రాజశేఖర్) మంచి ఫ్రెండ్. చిష్ట్రీ ద్వారా విశ్వ‌కి మిత్ర ప‌రిచ‌యమ‌వుతుంది. మిత్రాకి విశ్వ హెల్ప్ చేయడంతో వారి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారుతుంది. మిత్ర ఒక రోజు చిష్ట్రీ ఇంటికి వెళుతుంది. అయితే ఉన్నట్టుండి కరోన కారణంగా రాత్రికి రాత్రే సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారు. దాంతో మిత్ర అక్కడే లాక్ అయిపోతుంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఫ్లాట్ లోకి వెళ్ళి చిష్ట్రీని విచక్షణా రహితంగా పొడిచి మిత్రను కూడా చిత్రహింసలకు గురిచేస్తాడు. దీన్ని వర్చువల్ గా చూసిన విశ్వ హాతాశుడైపోడు.ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు. ఆమె బతకాలంటే నువ్వు ఉరేసుకుని చస్తే..మిత్రను వదిలేస్తా అంటాడు. అస‌లు ఆ వ్య‌క్తి ఎవ‌రు?ఆ వ్య‌క్తి నుండి విశ్వ మిత్ర‌, చిష్ట్రిల‌ను కాపాడాడా లేదా అనేది అసలు కథ.

WWW సినిమా రివ్యూ?

సాంకేతికత : ఇందులో గుహ‌న్ మేకింగ్ తో పాటు సినిమాటోగ్ర‌ఫి కూడా చాలా ప్ల‌స్ అయింది. కొన్ని స‌న్నివేశాల్లో విజువ‌ల్స్ హైలెట్ గా ఉన్నాయి. సైమన్‌ కె. కింగ్ సంగీతం, నేప‌థ్య సంగీతం క‌థ ఎక్క‌డా డీవియేట్ కాకుండా త‌న బీజియమ్‌తో ఆక‌ట్టుకుంటూనే పాట‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. అన్ని పాట‌లు స్క్రీన్ మీద ప్ల‌జెంట్‌గా ప్రొజెక్ట్ చేయ‌బ‌డ్డాయి. తమ్మిరాజు క్రిస్పి ఎడిటింగ్ బాగుంది.ఈ క‌థ‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే విని మొద‌టిసినిమాగా ఒక డిఫ‌రెంట్ చిత్రాన్ని ఎంచుకోవ‌డం గొప్ప విష‌యం.

టైటిల్‌: “WWW”(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)
న‌టీన‌టులు: అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్, ప్రియదర్శి, దివ్య, సందీప్‌, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ వైవా హర్ష,తదితరులు
స‌మ‌ర్ఫ‌ణ‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌
బ్యానర్‌: రామంత్ర క్రియేషన్స్
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్
నిర్మాత: డా. రవి ప్రసాద్ రాజు దాట్ల
కో–ప్రొడ్యూసర్‌: విజయ్‌ ధరణ్‌ దాట్ల
సంగీతం: సైమన్‌ కె. కింగ్
ఎడిటింగ్‌: తమ్మిరాజు
ఆర్ట్‌: నిఖిల్‌ హాసన్
డైలాగ్స్‌: మిర్చి కిరణ్
లిరిక్స్‌: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, రోల్‌రైడా
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: పొన్మని గుహన్
విడుద‌ల తేది: 24-12-21(సోనిలీవ్‌).

రేటింగ్ : 3

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago