Tag Archives: padma award

Kaikala Satyanarayana: కైకాలకు పద్మ పురస్కారం ఎందుకు రాలేదు ? కారణం అదేనా ?

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఆరు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతూ సుమారు 750 చిత్రాలకు పైగా నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకొని చలనచిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసిన కైకాల సత్యనారాయణకు ఇప్పటివరకు ఒక్క పద్మ అవార్డులు కూడా రాకపోవడం గమనార్హం.

తాజా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోను ఆరుగురికి ఈ అవార్డు వరించింది.అయితే వీరిలో కైకాల సత్యనారాయణకు అవార్డు రాకపోవడంతో ఎంతో మంది సినీ ప్రముఖులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.

ఆరు దశాబ్దాల నుంచి కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్నమైన పాత్రలో హీరోగా, విలన్ గా, తండ్రిగా తాత పాత్రలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయనకు ఇప్పటివరకు అవార్డు రాకపోవడం ఎంతో విడ్డూరం. ఇప్పటికీ ఈయన సేవలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు గుర్తించలేదు అంటూ విమర్శలు చేశారు.

టీడీపీ ఎంపీగా పని చేయడమే కారణమా…

అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సత్యనారాయణకు పద్మ అవార్డు ఇవ్వాలని ఎఫ్‌డీసీ కమీషనర్‌గా పనిచేసిన రమణాచారి, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పీఎస్సం జయ్ బారు సిఫార్స్ చేసినా.. ఆయనకు పద్మ అవార్డు రాలేదు. అందుకు గల కారణం అప్పుడు కైకాల టీడీపీ ఎంపీగా పని చేశారు.ఆ ఒక్క కారణంతోనే తనకు పద్మ అవార్డుకు అడ్డు పడ్డారని ఒకానొక సమయంలో కైకాల ఈ విషయం గురించి విచారం వ్యక్తం చేశారు. అందుకే ప్రతిభ ఉన్నవారికి కాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారికి మాత్రమే పద్మ అవార్డులు దక్కుతున్నాయి అంటూ పలువురు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు.

Singer Chinmayi: గరికపాటికి పద్మశ్రీ ఇవ్వడం పై స్పందించిన చిన్మయి.. పాత విషయాలను బయట పెడుతూ సెటైర్స్!

Singer Chinmayi:గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు రంగాలలో ఉన్న వారి సేవలను గుర్తించి వారికి పద్మ అవార్డులను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే అన్ని రంగాల వారికి కలిపి కేంద్ర ప్రభుత్వం 128 పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఈ పద్మ అవార్డులలో భాగంగా ప్రముఖ సహస్ర అవధాని గరికపాటి నరసింహారావు సాహిత్య రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

అయితే పద్మశ్రీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో సింగర్ చిన్మయి స్పందిస్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. గరికిపాటి నరసింహారావు పురాణాలను ఉదాహరణగా తీసుకొని ఎన్నో అద్భుతమైన ప్రవచనాలను చేస్తారు.

ఈ క్రమంలోనే చిన్న వయసు వారి నుంచి పెద్దవయసు వారి వరకు గరికపాటి ప్రవచనాలకు అందరూ ఆకర్షితులవుతారు.ఇలా సాహిత్య రంగంలో ఎంతో మంచి సేవలు అందించిన గరికపాటికి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల స్పందించిన చిన్మయి పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ సందర్భంగా చిన్మయి తన సోషల్ మీడియా ద్వారా గరికపాటికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తూ చేసిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన మహిళల వస్త్రధారణ గురించి చేసిన అసభ్యకర పదజాలంతో గురించి బయట పెట్టారు.

ఇలా గతంలో గరికిపాటి చేసిన వ్యాఖ్యలకు తాజాగా చిన్మయి సెటైర్లు వేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన గతంలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ మహిళలు ఆ విధమైనటువంటి దుస్తులు ధరిస్తే పురుషులు తట్టుకోలేరని గరికపాటి చెప్పిన వీడియోలను షేర్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు చీర కట్టుకుంటేనే పద్ధతిగా ఉంటారు అని ఇతర వస్త్రధారణ లు వేయడం వల్ల రేప్ లు జరుగుతున్నాయంటూ చెప్పడం విడ్డూరమని తెలియజేశారు.

ఇలా మహిళలు ధరించే డ్రస్సులు వల్ల రేప్ లు జరుగుతాయి అనడం విడ్డూరమని,ఇలా ఒక మనిషిని చూసి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేని వారు ఇంట్లోనే ఉండాలంటూ చిన్మయి ఫైర్ అయ్యారు.

కేవలం అమ్మాయిల గురించి డ్రస్సులు వల్ల, వాళ్లు అన్ని విప్పుకొని తిరగడం వల్లే రేప్ లు జరుగుతున్నాయని చెప్పారు అలాంటి వాళ్లకి ఒక ప్రశ్న అడుగుతాను అంటూ ఈమె ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ విధంగా ఆది వస్త్రధారణ గురించి గరికపాటి చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేస్తూ ఆయన పై సెటైర్లు వేయడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలపైఆయన అభిమానులు అదేవిధంగా కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఆమెపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గరికపాటి గొప్ప వ్యక్తి అంటూ..

గరికపాటి లాంటి గొప్ప వ్యక్తిని ఇలా అవమానపరచడం సరికాదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేయగా..మరికొందరు చిన్మయి ఉద్దేశపూర్వకంగానే ఒక వివాదం సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతోంది అంటూ పలువురు కామెంట్ చేశారు.