Tag Archives: Pan India heroes

Raviteja: ఆ పాన్ ఇండియా హీరోలకి రాడ్ దింపిన రవితేజ… కంటెంట్ ఉండాలంటూ భారీ సెటైర్స్!

Raviteja: మాస్ మహారాజ రవితేజ హిట్ ఫ్లాపాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఫస్ట్ షో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రవితేజ ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే రవితేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోల పై తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తూ కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే రవితేజను పాన్ ఇండియా సినిమాలపై తన అభిప్రాయాన్ని ప్రశ్నించగా ఈయన పాన్ ఇండియా సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమా అంటే సినిమాని భారీ లెవెల్ లో విడుదల చేయడం కాదు. ఇలా విడుదల చేస్తేనే పాన్ ఇండియా సినిమా అవుతుంది అనుకుంటే పొరపాటు. ఎప్పుడైతే మనం చేసే కథలో కంటెంట్ ఉంటుందో ఆ కథ పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందో అదే పాన్ ఇండియా సినిమా అవుతుందని ఈయన తెలిపారు.

Raviteja: పాన్ ఇండియా అంటే భారీ స్థాయిలో విడుదల చేయడం కాదు…

మన కథలో కంటెంట్ లేకుండా సినిమాని ఓ రేంజ్ లో భారీ స్థాయిలో విడుదల చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడతాయని తెలిపారు. ఇలా రవితేజ పాన్ ఇండియా సినిమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో రవితేజ పరోక్షంగానే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల గురించి సెటైర్లు వేశారని కొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.