Tag Archives: parents death

మహబూబ్ నగర్ చిన్నారులను ఆదుకోవాలని కలెక్టర్ కు ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్!

సాధారణంగా చిన్నపిల్లలకు తెలిసీ తెలియని వయసులో తల్లిదండ్రులు అండగా ఉండాలీ. కానీ అలాంటి పసిపిల్లలను అనాధలను చేసి ఆ తల్లిదండ్రులు అనంతలోకాలకు వెళ్లిపోతే.. ఆ పిల్లల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తల్లిదండ్రులు ఇక లేరు, ఇకపై తిరిగి రారన్న విషయం తెలియక ఆ చిన్నారులు పడే మనోవేదన వర్ణనాతీతం. అయితే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో దంపతులు ఇద్దరు మృతి చెందడంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. అసలేం జరిగిందంటే…

మహబూబాబాద్ జిల్లాకు చెందిన దంపతులు విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో వారి ఇద్దరు అమ్మాయిలు అనాథలయ్యారు. దీనికి సంబంధించి వార్త ఓ పత్రికలో రావడంతో ఇదే కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఆ చిన్నారులను ఆదుకోవాలని తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఆ చనిపోయిన ఆ దంపతులు మహబూబాబాద్ జిల్లాలోని సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండేవారు.అనపర్తి ఉపేందర్(32), తిరుపతమ్మ(32) దంపతులకు శ్యామల(8), బిందు(6) అనే ఇద్దరమ్మాయిలు కూడా ఉన్నారు.అయితే శుక్రవారం రోజు రాత్రి తిరుపతమ్మ బట్టలను ఆరేసే క్రమంలో జీఐ వైర్‌కు విద్యుత్ షాక్ ప్రసారం అవ్వడంతో షాక్ తగిలింది.ఇది చూసిన ఆమె భర్త ఉపేందర్ ఆమె కాపాడటానికి ప్రయత్నించాడు.

అయితే ఈ క్రమంలోనె ఆమెని కాపాడే ప్రయత్నంలో ఉపేందర్ కూడా విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు. ఇద్దరు దంపతులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దంపతులు కుమార్తెలు శ్యామల, బిందు కలసి తన తల్లిదండ్రుల అంత్యక్రియలలో ముందు నడిచారు. ఆ చిన్నారుల మనోవేదన చూసి ఇరుగు పొరుగు వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల పై పడి ఆ చిన్నారులు గుండెలవిసేలా రోదించారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరి అంత్యక్రియల్లో శ్యామల, బిందునే ముందు నడిచారు.దీనితో ఆ ఇద్దరు చిన్నారులకు అండగా నిలవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌కు మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఆదేశంతో పలువురు అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.