Tag Archives: passengers

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనకు సినిమాల పరంగా మాత్రమే కాకుండా ఎంతమంది అభిమానులు ఉన్నారు.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా బయట కనపడితే ఫ్యాన్స్ హడావిడి మామూలుగా ఉండదు. కనీసం వారితో ఒక్కసారి మాట్లాడి సెల్ఫీ తీసుకోవాలని భావిస్తారు. మైక్ టైసన్ విషయంలో కూడా అదే జరిగింది. ఈయన అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు మైక్‌టైసన్‌ విమానంలో వెళ్తుండగా ఆయన వెనక సీటులో ఉన్న అభిమాని తనని గుర్తించి తనతో మాట కలిపారు.

Mike Tyson: బాక్సింగ్ లెజెండ్ కి కోపం తెప్పించిన ప్యాసింజర్… చేయి చేసుకున్న మైక్ టైసన్… వీడియో వైరల్!

ఈ విధంగా సదరు ప్యాసింజర్ మైక్ టైసన్ ను వదలకుండా తనతో మాట్లాడుతూ తన సహనాన్ని పరీక్షించారు.అక్కడికి మైక్ టైసన్ కాసేపు గమ్మున కూర్చోమని తనకు చెప్పినప్పటికీ వినకుండా ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ విసిగించాడు. ఇక ఆ ప్యాసింజర్ ప్రశ్నలకు విసుగుచెందిన మైక్ టైసన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ప్యాసింజర్ పై చేయి చేసుకున్నారు.

బాక్సింగ్ కోచ్…

ఈ విధంగా తనని విసిగించడంతో వెనక్కి వెళ్లి ఆ ప్యాసింజర్ పై పిడుగుద్దుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే బాక్సింగ్ కోచ్ గా ఈయన లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేయనున్నారు.ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సజ్జనార్

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వీసీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అతడు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన ప్రతీ విషయంలో అతడు సానుకూలంగా స్పందిస్తూ మందుకు సాగుతున్నారు.

బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది ఆర్టీసీ. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్‌ ఉండగా.. ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు.

దీంతో అతడికి విషయం అర్థం అయింది. దీంతో అటువంటి స్టాల్ కు రూ. వెయ్యి జరిమానాతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. అంతే కాకుండా తాజాగా అతడు ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. టికెట్ కొనే సమయంలో ఆన్ లైన్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. నెటిజన్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరగుతున్న నేపథ్యంలో ఇదే పద్ధతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి మొదట ఎంజీబీఎస్, రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద బస్ పాస్ కౌంటర్లలో తీసుకొచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.