ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వీసీ సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అతడు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేసిన ప్రతీ విషయంలో అతడు సానుకూలంగా స్పందిస్తూ మందుకు సాగుతున్నారు.
బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది ఆర్టీసీ. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్ ఉండగా.. ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. దీనిపై ఎక్కువగా ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు.
దీంతో అతడికి విషయం అర్థం అయింది. దీంతో అటువంటి స్టాల్ కు రూ. వెయ్యి జరిమానాతో పాటు నోటీసులు కూడా జారీ చేశారు. అంతే కాకుండా తాజాగా అతడు ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందేంటంటే.. టికెట్ కొనే సమయంలో ఆన్ లైన్ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధమైంది. నెటిజన్ల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరగుతున్న నేపథ్యంలో ఇదే పద్ధతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి మొదట ఎంజీబీఎస్, రెతిఫైల్ బస్ స్టేషన్ వద్ద బస్ పాస్ కౌంటర్లలో తీసుకొచ్చామని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…