అయ్యగారు.. ఈ పదం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఎదుకంటే.. అక్కినేని అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ ఎదురుగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. అతడు అక్కినేని ఫ్యామిలీకి వీరాభిమాని.
దీంతో అయ్యగారు మీరు గ్రేట్ అంటూ అతడు చెప్పే డైలాగ్ లు చాలా పాపులర్ అయ్యాయి. దీనిపై అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. అతడిని తాను కచ్చితంగా కలుస్తానంటూ.. అఖిల్ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్టు చేశారు. “బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నాకు పెట్టిన అయ్యగారు అనే పేరు నా జీవితంలో భాగం అయిపోయింది. మీకు దండం బ్రదర్ ’’ అంటూ చెప్పాడు.
అస్సలు అతడు ఎవరు.. ఆ అభిమాని నేపథ్యం ఏంటి.. విషయాలను తెలుసుకుందాం.. అతడి పేరు నాగరాజు. గుంటూరులో ఓ కూలీగా పని చేస్తున్నాడు. అతడు చిన్నతనం నుంచే అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. నాగార్జున, నాగచైతన్య సినిమాలు ఏది విడుదల అయిన అతడు ఆ థియేటర్స్ ముందు సందడి చేస్తాడు. అయితే నాగార్జున నటించిన రాజుగారి గది 2 సినిమా విడుదల సందర్భంలో అతడు సినిమా చూసి ఎక్కువగా బాధ పడ్డాడు.
ఆ బాధలోనే ‘కింగ్ కొడుకు రావాలి.. అఖిలే నంబర్ వన్. అయ్యగారే కరెక్ట్.. అటూ అక్కడ నానా రచ్చ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ నుంచి అఖిల్ కు అయ్యగారు అనే పేరు పడిపోయింది. ఇప్పుడు అఖిల్ సినిమాలో కూడా లాస్ట్ లో హీరోయిన్ అయ్యాగారు అంటూ అఖిల్ ని సంబోధిస్తుంది. దీంతో ఫ్యాన్స్ కేరింతలతో హోరిత్తిపోతుంది. దీంతో నాగరాజు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. దీంతో అతడు ఇంకా మోస్ట్ పాపులర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…