అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా నిలచిన ప్రభాస్ చిత్రాలపై ఆల్ ఇండియాలో మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘సలార్’ సినిమాలోని ఓ ఫైటింగ్ సీన్ లో పది సెకండ్ల పార్ట్ లీక్ అయింది. ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ మూవీతో ఆల్ ఇండియాలో అలరించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
దాంతో ఈ లీకైన యాక్షన్ బిట్ పై మరింత ఫోకస్ సాగుతోంది. పది సెకండ్ల పాటే కనిపిస్తోన్న ఈ యాక్షన్ సీన్ ను జనం చూసి థ్రిల్ ఫీలవుతున్నారు. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లలో షేర్ చేస్తున్నారు. త్వరలో ప్రభాస్ పుట్టినరోజు ఉండటంతో ఈ సినిమా నుంచి ఏదైనా లుక్ లేదా టీజర్ రిలీజ్ చేస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ లోపే లీకేజీ వీరులు లొకేషన్‌లో చిత్రీకరించిన వీడియోను ఆన్ లైన్‌లో లీక్ చేసి ‘సలార్’ నిర్మాతలకు షాకిచ్చారు. ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతోంది. అక్కడ నుంచే ఈ వీడియో లీక్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నిర్మాతలు ఇలాంటివి మరోసారి జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ‘సాహో’ సినిమా రిలీజ్ అయిన దగ్గర్నుంచి ఇప్పటిదాకా ప్రభాస్ సినిమాల నుంచి పోస్టర్లే తప్ప టీజర్లు, ట్రైలర్లు, పాటలు లాంటివి ఏమి రాలేదు. ప్రస్తతం ఈ వీడియో లీక్ కావడంతో నిర్మాతలు కాస్త టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మూవీ సభ్యులు సిద్ధం అయ్యారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…