తెలుగు సినీ పరిశ్రమలో టాప్ సీరియల్స్‌లో ఒకటి మొగలిరేకులు. దీనిలో దయా అలియాస్ పవిత్ర నాథ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే అతడి చీకటి వ్యవహారాన్ని అతడి భార్య శశిరేఖ బయటపెట్టింది. మొగలిరేకులు సీరియల్‌లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. 2009లో అతడు తనను పెళ్లి చేసుకున్నాడని.. కొన్నాళ్ల వరకు సంసారం బాగానే సాగిందని.. తర్వాత తమకు పాప కూడా జన్మించిందని చెప్పింది. పెళ్లయిన దగ్గర నుంచే అతడికి అమ్మాయిలు అంటే పిచ్చి అని.. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడని సంచలన నిజాలను బయటపెట్టింది.
ఏంటని ప్రశ్నించిన ప్రతీసారి చేయి చేసుకున్నట్లు తెలిపింది. ఓ అమ్మాయితో దాదాపు 8 ఏళ్లు రిలేషన్ లో ఉన్నాడని.. తాగి వచ్చి ఎంతో టార్చర్ పెట్టేవాడని తెలిపింది. అతడిలో మార్పు తీసుకొద్దామని ఎంత ప్రయత్నం చేసినా రాలేదని.. రాత్రి పగలు తేడా లేకుండా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడని వాపోయింది.
ఈ విషయంపై తన అత్తమామలకు చెప్పినా పట్టించుకోలేదని.. వాళ్లు కూడా అతడికే సపోర్ట్ పలికారన్నారు. విడాకులు సైతం ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగొద్దని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి దారుణంపై తనకు న్యాయం చేయాలని తాజాగా ఆమె కోర్టు మెట్లెక్కింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…