సంచలనాల దర్శకుడు వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటుంది. అతడు ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లు కూడా అలాగే ఉంటాయి. అతడిని ఎంత మంది విమర్శిస్తురో.. అంత కంటే ఎక్కువగా అతడిని ఫాలో అవుతుంటారు. అయితే ఈ వివాదాల దర్శకుడు హుజురాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి అతడు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.
అది పెద్ద వైరల్ గా మారింది. అతడు ఏమని పోస్టు చేశాడంటే.. ‘‘గతంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవి ఎలా సొంతం చేసుకున్నారో… ఈటల కూడా అలాంటి ప్రయత్నమే చేశారనిపిస్తుంది. అందుకే కేసీఆర్- ఈటల వెన్నుపోటు ఎపిసోడ్ పై తెలంగాణా రాజకీయ మేధావులతో చర్చించి… మూవీ చేస్తానంటూ ప్రకటించారు.
అలాగే ఈటల, కేసీఆర్ మార్ఫింగ్ ఫొటోలతో వెన్నుపోటు టైటిల్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల అభిమానులు ఆర్బీవీపై మండిపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా అతడు ప్రయత్నిస్తున్నాడని ఇది కరెక్ట్ కాదంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. అతడు ఇటీవల కొండా సురేఖ, మురళి దంపతులకు సంబంధించి బయోపిక్ కు తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించి షెడ్యూల్ కూడా మొదలైంది. ఆ సినిమాను ‘కొండా’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈటల వెన్నుపోటు చిత్రంలో వర్మ ఎలాంటి విషయాలు ప్రస్తావిస్తాడో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…