Tag Archives: pawan kalym

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.