Tag Archives: Pitapuram

Pitapuram: అందరి ఆసక్తి పిఠాపురం పైనే.. గెలుపు ఎవరిది.. సర్వేలు ఏం చెబుతున్నాయి?

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి అయితే ఎన్నికల హడావిడి మొదలైనప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరి జెండా ఎగురుతుందన్న విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇలా పిఠాపురం పైన ఇంత ఆసక్తి రావడానికి కారణం అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే కారణమని చెప్పాలి.

గత ఎన్నికలలో భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం కాపులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు ఈ క్రమంలోనే ఈయనకు పోటీగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అయినప్పటికీ ఎవరు గెలుస్తారో అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఎన్నో చానల్స్ వారు ప్రజా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. వంగా గీత కూడా అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ అంతేకాకుండా ప్రస్తుతం కాకినాడ ఎంపీగా కూడా ఈమె కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వంగా గీత కాకుండా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

జనసేనదే విజయమా..
ఇకపోతే వంగా గీత 2009వ సంవత్సరంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు అయితే అప్పట్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చిన పిఠాపురానికి చేయాల్సినటువంటి న్యాయం చేయలేకపోయారని అందుకే ఈసారి పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నామంటూ చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారంటూ పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి చూడాలి మరి పిఠాపురంలో ఏ జెండా ఎగురుతుంది వంగా గీత పవన్ కళ్యాణ్ కి ఎలా పోటీగా నిలబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Pitapuram: పిఠాపురం పై ఫోకస్ చేసిన వైసీపీ అధిష్టానం.. పవన్ ఓటమి లక్ష్యమా?

Pitapuram: ఏపీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో వైసిపి అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో భాగంగా వైసిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి రాబోతున్నారు కూటమి నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి రాబోతున్నారు.

ఎలాగైనా పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీత గెలుపొందే దిశగా వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తుంది.ఇప్పటికే పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు, ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రీజనల్ కో- ఆర్డినేటర్ మిథున్ రెడ్డిలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. మండలాల వారిగా నేతలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇక నేడు ముద్రగడ్డ పద్మనాభం వంగ గీతా నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

కాపు ఓట్లే లక్ష్యంగా..
పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో టిడిపి పార్టీకి చెందిన వారందరినీ కూడా వైసిపి పార్టీలోకి చేరే విధంగా దృష్టి పెట్టాలా చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో కాపు ఓటు బ్యాంకును వైసీపీ వైపుకు మళ్లించేలా సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో 90వేలకుపైగా కాపు ఓటర్లు ఉన్నారు. మెజార్టీ కాపు ఓటర్లను వైసీపీకి వైపుకు మళ్లిస్తే గీత గెలుపు ఖాయం అవుతుందని భావిస్తున్నారు ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా అధిష్టానం అడుగుల ముందుకు వేస్తున్నారని తెలుస్తుంది.