Tag Archives: post office schemes

పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తో కోటి రూపాయిలు.. ఎలా అంటే?

కోటీశ్వరులు కావాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఇది అందరి విషయంలోనూ నెరవేరదని భావిస్తుంటారు. కానీ పోస్ట్ ఆఫీస్ అందించే ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలనే కలను నెరవేర్చుకోవచ్చు. అయితే ఇందుకు కొంత సుదీర్ఘ సమయం పడుతుంది. అదేవిధంగా ప్రతి రోజు మూడు వందల రూపాయలు మనం ఆదా చేసుకోగలిగితేనే కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.

ఇప్పటికే పోస్టాఫీసు ద్వారా ఎన్నో సేవింగ్ స్కీమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసుల్లో సేవింగ్స్ మనకు ఎప్పుడు ఏ ప్రమాదం కాదు.పోస్టాఫీస్ స్కీమ్స్‌లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF పీపీఎఫ్ కూడా ఒకటి. పీపీఎఫ్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. బెస్ట్ రిటైర్మెంట్ స్కీమ్ అని కూడా చెప్పవచ్చు.

ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. మీరు పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు ఈ ఖాతాను తెరవచ్చు. ఈ స్కీమ్ పై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకొకసారి మారుస్తుంది. కొన్నిసార్లు వడ్డీ శాతం పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. మరికొన్నిసార్లు స్థిరంగా అయినా కూడా ఉండవచ్చు. అయితే ఈ స్కీమ్ ద్వారా సేవింగ్స్ చేయడం వల్ల ఎటువంటి రిస్క్ ఉండదు.

ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు కావాలంటే దీని కాలపరిమితి మనం పెంచుకోవచ్చు.ఈ స్కీమ్ ద్వారా ప్రతి రోజు మూడు వందల రూపాయలు ఆదా చేసుకొని నెలకు తొమ్మిది వేల రూపాయలను ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయాలి.ఈ విధంగా 30 సంవత్సరాల పాటు ప్రతి నెల తొమ్మిది వేల చొప్పున జమ చేయడం వల్ల మీరు కోటీశ్వరులు కావాలనే కల నెరవేరుతుంది.

డబ్బుకు అదిరిపోయే లాభం ఇచ్చే ఐదు స్కీమ్ లు ఇవే..?

మనలో చాలామంది డబ్బులను పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పొదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. అయితే సరైన విధంగా డబ్బులను ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే అదిరిపోయే లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో తక్కువ సమయంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అదిరిపోయే లాభాలను అందిస్తున్నాయి.

అయితే అదిరిపోయే లాభం పొందాలంటే కొన్నిసార్లు రిస్క్ తీసుకోవడంతో పాటు దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం 5 స్కీమ్స్ ఇతర స్కీమ్ లతో పోలిస్తే అదిరిపోయే ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఇందులో మొదటిది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 7.4 శాతం వడ్డీని పొందవచ్చు. గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు మాత్రమే ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరే ఛాన్స్ ఉంటుంది. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా అదిరిపోయే లాభాలను అందిస్తోంది. 1000 రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ప్రతి నెలా ఖాతాలో వడ్డీ డబ్బులు జమవుతాయి. ఆర్‌బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టి కూడా సులువుగా ఆదాయం పొందవచ్చు.

ఆర్బీఐ బాండ్లలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి నష్టం ఉండదు. బజాజ్ ఫైనాన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి సులభంగా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు సైతం ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో పెట్టుబడులు పెట్టినా ఎలాంటి రిస్క్ ఉండదు.