Tag Archives: Pregnancy termination

కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. అబార్షన్ కు అనుమతించిన కోర్టు..

ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న కొన్ని కోర్టులు సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని.. మైజర్ అయిన తర్వాత చట్టబద్దం చేసుకోవచ్చని.. అంతేకాకుండా మేజర్ అయిన తర్వాతనే విడాకులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులు బాటు ఉంటుందని తీర్పు చెప్పింది.

తాజాగా మరో సంచలన తీర్పు వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితులకు ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది కేరళ హైకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్ లో గర్భస్రావం చేయడం అనేది నేరంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో అది చట్టబద్దమైనదిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే తొలగిస్తారు.

దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే కేరళ హైకోర్టు ఓ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది.. ఆమె 8 నెలల గర్భవతి. గర్భస్రావం చేయాలని వైద్యులను సంప్రదించినప్పుడు.. వైద్యులు ఇలా చేయడం నేరం అంటూ చెబుతారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిస్తుంది. ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అనేది సదరు మహిళ సమ్మతి మాత్రమే అని.. దీనిపై తల్లిదండ్రులకు, భర్తకు ఎలాంటి అధికారం లేదని తెలిపింది.

18 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు గర్భవతి అయితే మాత్రం కచ్చితంగా తల్లిదండ్రుల సమ్మతి ఉండాల్సి ఉంటుంది. అయితే ఆమెకు అబార్షన్ చేసేందుకు కేరళ కోర్టు అంగీకరించింది. దానికి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించింది. దీంతో బాధితులకు ఇది అనుకూలమనే చెప్పాలి. కానీ కొన్ని మార్గదర్శకాలను మాత్రం పాటించాలని సూచించారు.